పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు రఘుబాబు తను హీరోగా అయిన తర్వాత మన ఊర్లో ‌ఒక థియేటర్ కట్టిస్తానని తన తల్లికి చెప్పేవాడు. ఆ క్రమంలో 1989 క్రమంలో పరుచూరి బ్రదర్స్ ఒక కథ రాయడం జరిగింది. ఆ కథ విన్న దర్శకుడు షిండే ఆ స్క్రిప్ట్ చివర ప్రేమ లేని ప్రేమ ఖైదీ అని రాసి వెళ్లిపోయారు. ఆ తర్వాత దర్శకుడు బి.గోపాల్ ఆ కథ విని సానుకూలంగా స్పందించలేదు.

ఇలా ఎంతో మంది దర్శకులు విన్నా ఆ స్టోరీ పట్ల ఎవరూ తమ సుముఖతను వ్యక్తం చేయలేదు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో ఆ సినిమా తీద్దాం అనుకున్నారు. అప్పుడే రాజేంద్రప్రసాద్ హీరోగా చెవిలో పువ్వు సినిమా తీసిన ఇ.వి.వి.సత్యనారాయణ ఆ కథ పట్ల ఆసక్తి చూపి తాను చేస్తానని ముందుకు రావడం జరిగింది. చెవిలో పువ్వు పెద్దగా ఆడకపోవడంతో సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈవీవీ సత్యనారాయణ అనగానే సందేహించారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్ మేము మీ వెంటే ఉంటామనడంతో ఈవీవీ సత్యనారాయణ ప్రేమ ఖైదీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హరీష్, మాలాశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు.

కానీ వీరికంటే ముందే వెంకటేశ్వర రావు కొడుకు రఘు బాబు అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతి రావు కొడుకు రవిబాబు ఇద్దరు హీరో పాత్ర కు పోటీ పడ్డారు. ఆ తర్వాత ఈ సినిమాలో నటించే కంటే ముందే నానాజాతి సమితి అనే నాటకాన్ని వేయమని రఘుబాబు తండ్రి వెంకటేశ్వరరావు అన్నారు. అప్పుడు రఘుబాబు దానికి సంబంధించిన స్క్రిప్ట్ చదివి చేద్దాం అనుకొని రవీంద్రభారతి లో రిహార్సల్స్ వేస్తున్నప్పుడు నోట్లో నుంచి రక్తం కక్కుకున్నారు. వెంటనే రఘుబాబును ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్ చేయించిన తర్వాత తన తల దిండు కింద ఆ స్క్రిప్ట్ ని పెట్టుకొని తన ఆరోగ్యం బాగా అయిన తర్వాత ఆ నాటకం వేస్తానని చెప్పాడు. కానీ విధి ఆడిన మరో నాటకంలో రఘుబాబు విగతజీవిగా మిగిలిపోయారు. అలా రఘుబాబు చనిపోవడంతో ప్రేమ ఖైదీ లోని ఆ పాత్ర కాస్త హరీష్ కుమార్ కి వెళ్ళింది. 1990 లో విడుదలైన ప్రేమఖైదీ సూపర్ డూపర్ హిట్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here