రాజన్న సినిమాలో నటించిన ఈ బాలనటి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోతారు..!!

0
108

సినీ పరిశ్రమలో ఎంతోమంది బాల నటీనటులు పెద్దయ్యాక హీరో గాను లేదా హీరోయిన్ గానో సెటిల్ అవడం మనం చూస్తున్నాం. కమల్ హాసన్, శ్రీదేవి, నాగార్జున, రాశి, మీనా, మహేష్ బాబు, మనోజ్, తరుణ్ లాంటి ఎంతో మంది బాలనటులు పెరిగి పెద్దయ్యాక పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్నారు. అలా కేరళకు సంబంధించిన బేబీ యాని కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తన మొదటి తెలుగు సినిమా ‘అనుకోకుండా ఒక రోజు’ కాగా.. స్టాలిన్, అతిథి, రెడీ, స్వాగతం, శౌర్యం, కేడీ, ఏక్ నిరంజన్ లాంటి సినిమాలో బాలనటిగా బేబీ యాని నటించారు.

ఒక టెలీఫిల్మ్, గోరింటాకు సీరియల్, నాగార్జున హీరోగా నటించిన రాజన్న వీటిలో నటించిన బేబీ యానికి మూడు నంది అవార్డులు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెల్లెలుగా యాని నటించి ప్రేక్షకులను మెప్పించింది. హైదరాబాద్ లోని అవినాష్ కామర్స్ కాలేజీలో ఆమె ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్నారు. ఈ అమ్మాయిని చూస్తుంటే ఇక బాలనటి స్థాయి నుండి హీరోయిన్ గా ఎదిగినట్టు అనిపిస్తుంది. ఇక త్వరలో లో ఏ స్టార్ హీరో సరసన నటించి మరో మెట్టుకు ఎదిగితుంది కావచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here