ఒక వైపు తెలుగు సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే.. మరోవైపు జబర్దస్త్ షోలో అదిరిపోయే స్కిట్స్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు కమెడియన్ అప్పారావు.. ప్రస్తుతం బుల్లితెరపై జబర్దస్త్ షోలో ఆసమ్ అప్పి పేరుతో తన నటనా సామర్ధ్యాలను నిరూపిస్తున్నాడు అప్పారావు.

అలాగే జబర్దస్త్ కమెడియన్స్ అందరికీ ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్యకాలంలో జబర్దస్త్ కమెడియన్స్ లనే ఏరికోరి తమ తమ సినిమాల్లో కామెడీ చేయించేందుకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు మన టాలీవుడ్ డైరెక్టర్స్. అలాగే ఎన్నో స్పెషల్ ఈవెంట్స్ లో కూడా జబర్దస్త్ కమెడియన్స్ తమదైన కామెడీతో అదరగొట్టేస్తూ.. ఫ్యాన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించడమే కాకుండా డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. జబర్దస్త్ షో కి రాకముందు నుండే అప్పారావు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో అక్కడక్కడా కనిపించాడు అప్పారావు. కానీ జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పారావుకి మంచి గుర్తింపు రావడంతో సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. జబర్దస్త్ షోలో పాల్గొనడం ద్వారా ఏకంగా 100కు పైగా సినిమా ఛాన్స్ లను దక్కించుకున్నట్లు అప్పారావు ఓ ఇంటర్వ్యూలో ఛెప్పడం విశేషం.

అయితే ఈమధ్య కాలంలో జబర్దస్త్ షోలో నటిస్తున్న నటులు ఒక్కొక్కరిగా భారీగానే తమ రేట్ పెంచేస్తూ.. డబుల్ చేసారనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇదే ప్రస్తావన జబర్దస్త్ టీమ్ లీడర్ అప్పారావు దగ్గర తీసుకురావడంతో ఈ ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో రెమ్యునరేషన్స్ గురించి అప్పారావు ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. “జబర్దస్త్ షోలో స్కిట్స్ చేసినందుకు మీకు భారీగానే రెమ్యునరేషన్ వస్తుందంట కదా.. ఎంత తీసుకుంటున్నారు.?” అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు విస్తుపోయిన అప్పారావు ఆ తర్వాత అసలు నిజాలు చెప్పాడు. జబర్దస్త్ పుణ్యమా అని ఆర్ధికంగా బాగానే సెటిలయ్యామని.. డబ్బుతో పాటు మంచి గుర్తింపు కూడా వచ్చిందని, ముఖ్యంగా ఈ జబర్దస్త్ లాంటి కామెడీ షోలే కాకుండా స్పెషల్ ఈవెంట్స్ ఆఫర్లు కూడా వస్తున్నాయని, ఆఫరిచ్చిన వాళ్ళ రేంజ్ ను బట్టి రేట్ కూడా ఉంటుందని, ఒక్కొక్కసారి బయట ఈవెంట్స్ కి వెళ్లాల్సి వచ్చినపుడు ఒకరోజంతా ప్రయాణం చేయాల్సి వస్తుందని.. అలా ప్రయాణం చేసినందుకు కూడా రెమ్యునరేషన్ తీసుకొంటున్నారని తెలిపాడు.

ఇకతన రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. అందరి కంటే ఎక్కువ రాదు కానీ అందరితో పాటు భారీగా వస్తుందని, ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు తనకంటే ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందని, తను టీం లీడర్ కాబట్టి లక్షల్లోనే రెమ్యునరేషన్ వస్తుందని పరోక్షంగానే ఒప్పుకున్నాడు అప్పారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here