బుల్లితెరపై మళ్ళీ మొదలవుతున్న జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో హవా !!

0
156

బుల్లితెర ప్రేక్షకులను ‘జబర్దస్త్’ షో ఆకట్టుకున్నంతగా మరే ఇతర కామెడీ షో ఆకట్టుకోలేదంటే అతిశయోక్తి కాదేమో.! ఈ షో ప్రారంభమైన క్రొత్తలో ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. అయినా సరే నేటి జబర్దస్త్ షోకి ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గకుండా జనాలు విరగబడి ఈ షోను చూస్తున్నారంటే ఈ షోకున్న క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే..

ఒక్క బుల్లితెర పైనే కాకుండా యూట్యూబ్‌లోనూ ఈ షోకి లక్షలు, కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని టీవీ కార్యక్రమాల్లాగే ఈ షోకి సంబంధించిన షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. అయితే గతంలో షూట్ చేసిన కొన్ని ఎపిసోడ్లతో 1,2 వారాలు షోను నడిపించారు కానీ.. ఆ తర్వాత షూటింగ్స్ లేకపోవడంతో పాత ఎపిసోడ్లతో షోను కంటిన్యూ చేస్తున్నారు. ఇక ప్రస్తుత విషయానికొస్తే.. ఇప్పటివరకూ అన్ని ఎపిసోడ్స్ ను చూసిచూసీ బోర్ కొట్టేసిన ప్రేక్షకులు కొత్త ఎపిసోడ్ల కోసం ఎదురు చూస్తున్నారు. మరి బుల్లితెర ప్రేక్షకుల నిరీక్షణ ఫలించిందన్నట్లుగా వచ్చే వారం నుంచి ‘జబర్దస్త్’ షో కొత్త ఎపిసోడ్లు ప్రసారం కాబోతున్నాయి.

ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈమధ్యనే యాంకర్ అనసూయతో ‘జబర్దస్త్’ ఎపిసోడ్లను షూట్ చేశారు. టీం లీడర్లందరూ ఈ షూటింగ్ లో పాల్గొని స్కిట్లలో నటించారు. ఇక లాక్ డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా విశాఖపట్నంలోనే ఉండిపోయిన రష్మి గౌతమ్ కూడా భాగ్య నగరానికి చేరుకుని ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ షూటింగ్‌లో పాల్గొన్నట్లుగా ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జబర్దస్త్’ షోలో గ్రూప్ లీడర్లు కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలోనే స్కిట్లు తయారు చేసినట్లు ‘జబర్దస్త్’ తాజా సమాచారం. చదివారుగా… జబర్దస్త్ షో రీబ్యాక్ న్యూస్ ను.. మరి ఈవారం నుండి కడుపుబ్బా నవ్వుకోవడానికి మీరూ సిద్ధమైపోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here