Featured
జూలై 15 వ ఎపిసోడ్: నీకు పెళ్లి కావాలా… జైలు కావాలా.. తేల్చుకో?
Published
3 years agoon
By
lakshanaబుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతో రసవత్తరంగా కొనసాగుతోంది. గత ఎపిసోడ్లో ఇంటరాగేషన్ పేరిట ఏసిపి దీప ఇంటికి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం మోనిత రోషిణిని కలుస్తుంది. ఈ క్రమంలోనే రోషిణిని తప్పు చేశానన్న ఫీలింగ్ కార్తీక్ లో అస్సలు కనిపించడం లేదు. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది.అయినా నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది కనుక తప్పకుండా న్యాయం చేస్తానని రోషిణిని చెబుతుంది. ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్లకు శిక్షపడేలా చేస్తాను ఈ విషయం నాకు వదిలిపెట్టు అని చెప్పగా మోనిత మనసులో ఈమె నాకన్నా తేడాగా ఉంది. నాకు సహాయం చేస్తుందా లేదా వారికి చేస్తుందా అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
అదే సమయానికి కార్తీక్ తన తండ్రి తిరిగి వస్తున్నాడు అని ఆలోచిస్తూ బాధగా కూర్చుంటాడు. అప్పుడు దీపా భోజనం చేద్దురు రండీ అంటుంది. కార్తీక్ బాధగా.. తండ్రి వస్తున్నాడు ఈ విషయాలన్నీతెలిస్తే బాధపడతాడు అంటుండగా దీప ఇక్కడ జరిగిన విషయాలు ఏవి మామయ్యకు చెప్పవద్దు. ఇక్కడ హాస్పిటల్ పెట్టడం వల్లే అందరం కలిసి ఇక్కడే ఉన్నామని చెప్పండి అంటుంది. రేపు పొద్దున్నే మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళండి… నాకు కొంచెం పని ఉంది అది చూసుకొని మామయ్య వచ్చేలోపు నేను అక్కడికి వస్తాను అంటుంది దీప. దీంతో కార్తీక్ రేపంతా ముఖ్యమైన పని ఏమిటి అని అడుగగా… వెళ్లొచ్చాక మీకే తెలుస్తుంది అని చెబుతుంది.
ఇక ఉదయాన్నే ఆదిత్య తన తండ్రిని తీసుకురావడానికి వెళ్తూ బాధగా కనిపించడంతో శ్రావ్య ఏం జరిగిందని అడుగుతుంది. దీంతో వదిన ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయాన్ని నాన్నకు చెప్పవద్దని అంది.. ఎందుకో అర్థం కావట్లేదని బాధపడతాడు. శ్రావ్య కూడా అదే ఆలోచిస్తూ అన్యాయం జరుగుతుంటే చెప్పొద్దనడం ఏంటి అంటూ అనుకుంటుంది. ఈ సమయంలోనే ఏసీపీ రోషిణీ ముందు ప్రియమణి గజగజా వణుకుతూ.. నిలబడుతుంది. ‘నాకు నిజం చెప్పని వారిని కొట్టడానికి ఇద్దరిని ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఈమధ్య వారికి పని లేక అన్ని పగలు కొడుతున్నారు. నేను వాళ్లకి మాటిచ్చాను. నువ్వు నాకు నిజం చెప్పలేదు అనిపిస్తే నేను వాళ్లకు నిన్ను ఇస్తాను అంటుంది రోషిణీ. అప్పుడు ప్రియమణి మీరు ఏం అడిగితే అది చెప్తాను అంటూ ఆమె కాళ్ళ పై పడుతుంది.
అప్పుడు రోషిణీ అయితే ఆ రూంలోకి వెళ్లి వెయిట్ చెయ్ ఎవరికి ఫోన్ చేయకు అని చెప్పి సీసీ కెమెరాలు ఉన్న రూమ్ లోకి పంపిస్తుంది. అయితే అక్కడ కెమెరాలు ఉన్న విషయం ప్రియమణికి తెలియక నిజం చెబితే ఆ అమ్మ చంపుతుంది. చెప్పకపోతే ఈ అమ్మ చంపుతుంది అని కంగారు పడుతూ అర్జెంట్‌గా మోనితమ్మకి ఫోన్ చేసి.. నన్ను ఈవిడ తీసుకొచ్చి పడేసిందని మోనితమ్మకి చెప్పి.. ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కనుక్కుని ఇక్కడ చెబుతా… అయినా మోనిత మించిన కిలాడి ఎవరుంటారు ?అని ఫోన్ నొక్కుతూ లాఠీలు చూసి ఆగి పోతుంది. అయితే ఆ రూమ్ లో ప్రియమణి మాట్లాడే మాటలు అన్ని బయట రోషిణీ వింటుంది.
మరోవైపు ప్రియమణి ఎక్కడికివెళ్ళింది అనుకుంటూ మోనిత కంగారుగా అటూ ఇటూ తిరుగుతోంది. ఈ క్రమంలోనే భాగ్యం మెట్లెక్కుతూ రావడం చూసిన మోనిత ఏయ్ ఆగు అక్కడే.. పైకి వచ్చేస్తావేంటీ.. వెళ్లు’ అని మోనిత కసరడంతో భాగ్యం వెనక్కి వెళ్తుంది. అయితే ఈ సారీస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లతో వంటలక్క ఎంట్రీ ఇస్తూ అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ నీ తన్ని మోనిత కి షాక్ ఇస్తుంది. ఇలా ఎంట్రీ ఇచ్చిన దీప కంప్లైంట్ ఇచ్చావా? మా పరువు తీసేద్దాం అనుకుంటున్నావా? అని నిలదీయడంతో మోనిత పొగరుగా అవును పరువు తీసేస్తా’ అంటూ పొగరుగా మాట్లాడటంతో.. మన వంటలక్క మోనిత ముందే సోఫాలో కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చుని కళ్ళు పెద్దవి చేసి చూడటంతో మౌనిక షాక్ అవుతుంది.
ఇప్పుడు దీపం మాట్లాడుతూ ఈ కడుపు సంగతి, 25వ తారీకు పెళ్లి సంగతి పక్కన పెట్టు. నీకు దుర్గా గుర్తున్నాడా… అంజి కూడా గుర్తున్నాడా.. అనగానే మోనితలో కంగారు, భయం కనిపిస్తాయి. గతంలో వారు చేసిన పనులు అన్ని గుర్తుకు వస్తాయి. ఏసీపీ గారి ముందు వాళ్లిద్దరినీ హాజరుపరిచాక అప్పుడు మాట్లాడుకుందాం..’ అని దీప అనడంతో మోనిత ముఖంలో రంగులు మారిపోయి హిమను చంపడం కార్తీక్ కి యాక్సిడెంట్ చేయించిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. దీపా పైకి లేచి 25తారీఖుని రెడ్ స్కెచ్‌తో సర్కిల్ వేసి చూపిస్తూ.. ‘ఇదే.. ఇదే 25 తేదీ.. నీకు పెళ్లి కావాలా? జైలు కావాలా తేల్చుకో..’ అని దీప అనడంతో
మోనిత తల తిరుగుతుంది. అక్కడే ఉన్న భాగ్యం మెల్లిగా పెళ్లా..జైలా?’ అని నెమ్మదిగా చెవిలో చెబుతున్నట్లుగా అడుగుతుంది.దీప నవ్వుతూ.. ‘మ్చీ.. పడిపోయేలా ఉంది..’ అంటుంది. మోనిత నిజంగానే కళ్లు తిరిగి పడేలా కనిపిస్తోంది. తరువాత ఏం జరుగుతుందో తరువాయి ఎపిసోడ్ వరకు వేచి చూడాలి.
You may like
Karthika Deepam: నాగచైతన్య సాయి పల్లవిని ఇమిటేట్ చేసిన డాక్టర్ బాబు వంటలక్క.. వీడియో వైరల్!
Karthika Deepam 2: ఘనంగా కార్తీకదీపం2 ప్రీ రిలీజ్ వేడుక.. టెలికాస్ట్ ఎప్పుడంటే?
Karthika Deepam: ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోబోతున్న కార్తీకదీపం 2… చరిత్రలో ఇదే తొలిసారి?
Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో కార్తీకదీపం విలన్ మోనిత… ఈమె రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vantalakka: డాక్టర్ బాబు ఇంట్లో సందడి చేసిన వంటలక్క.. చీర సారే పెట్టిన మంజుల నిరుపమ్!
Karthika Deepam Child Artists: స్టేజ్ పై డాన్స్ అదరగొట్టిన కార్తీకదీపం హిమ, శౌర్య.. వీడియో వైరల్!
Featured
AP Politics: మాపై రాజకీయ రంగు పూయకండి.. మమ్మల్ని ఆదుకోండి…ఆందోళన చేస్తున్న వాలంటీర్లు!
Published
28 mins agoon
23 November 2024By
lakshanaAP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు సంచలనంగానే ఉంటాయి. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే 5000 గౌరవ వేతనంతో వాలంటీర్లు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా మారారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు అన్నింటిని స్వయంగా ప్రజల ఇంటి ముంగిటకు తీసుకువెళ్లారు.
ఇలా వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వీరికి 5 వేల రూపాయల గౌరవ వేతనం అందించారు. అయితే మొదట్లో ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్నికల సమయానికి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం అందించబోతున్నట్లు ఈయన వెల్లడించారు.
ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేక పోతున్నారని వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మమ్మల్ని మీరే ఆదుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ను కోరుతూ ఆందోళనలు చేపట్టారు.
AP Politics: విధులలోకి తీసుకోండి..
ఎన్నికల హామీలలో భాగంగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పదివేల రూపాయల వేతనం చెల్లించాలని తెలిపారు.. దయచేసి మాపై రాజకీయ రంగు పూయకండి మేము ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అధికారుల ఆదేశాలను పాటిస్తామని మాపై మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే మమ్మల్ని విధులలోకి తీసుకోవాలని వాలంటీర్లు ఆందోళన చేశారు. అయితే గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఇకపై వాలంటీర్ వ్యవస్థ ఉండదనే ఉద్దేశంతోనే ప్రస్తుత అధికార నేతలు మంత్రులు వెల్లడిస్తున్నారు.
Featured
Chandra Babu: జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు… ఏపీలో సాధ్యమేనా?
Published
39 mins agoon
23 November 2024By
lakshanaChandra Babu: వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా 2027 వ సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలను నిర్వహించాలని ఇందుకు సంబంధించిన బిల్లుకు త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో కూడా ఆమోదం తెలుపబోతున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లను చేస్తుంది. ఇక ఈ ఎన్నికలకు మద్దతుగా ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా నిలిచారు ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఎన్డీఏ కూటమిలో సభ్యులు కావడంతో జమిలి ఎన్నికలకు ఈయన కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.
గతంలో జమిలి ఎన్నికలకు తాము కూడా అనుకూలమే అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఈ ఎన్నికల విధానంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగిన ఏపీలో మాత్రం ఈ ఎన్నికలు జరగవని తెలిపారు. 2029 ఎన్నికల సమయం పూర్తి అయిన తర్వాతనే ఎన్నికలు జరుగుతాయి తప్ప ముందస్తు ఎన్నికలు అసలు రావని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Chandra Babu:ముందస్తు ఎన్నికలు లేవు…
ఇలా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడానికి జమిలి విధానానికి అన్ని రాష్ట్రాలు కట్టబడి ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ముందస్తు ఎన్నికలు జరగవనే విషయాన్ని వెల్లడించడంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Featured
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్: నాని
Published
51 mins agoon
23 November 2024By
lakshanaPawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు ఇక పవన్ కళ్యాణ్ చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయన మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కూడా ఎంతో ఆసక్తిని కనపరుస్తూ రాజకీయాలలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
రాజకీయాలపై ఉన్న ఆసక్తితో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికలలో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు అయితే ఈయన రాజకీయ ప్రస్థానం కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా నాని రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ది రానా దగ్గుబాటి టాక్ షో అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావనకు రావడంతో పవన్ గురించి నాని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచిన వారిలో నాని కూడా ఒకరు.
ఈయన పవన్ కళ్యాణ్ గెలుపును కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు మద్దతు తెలియజేశారు. ఇక తాజాగా పవన్ రాజకీయాల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు రాజకీయాలలో కూడా ఆయన పవర్ స్టార్ అంటూ కామెంట్లు చేశారు. ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఈయన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని నాని తెలిపారు.
Pawan Kalyan: సూపర్ స్టార్..
ఇక నాని వ్యాఖ్యలపై రానా కూడా స్పందిస్తూ పవన్ నిజంగానే రాజకీయాలలో సూపర్ స్టార్ అని ఎంతో కష్టపడి రాజకీయాలలో ఈ స్థాయికి చేరుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం రాజకీయాలు కూడా సినిమాల మాదిరిగానే ఉన్నాయంటూ రానా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
AP Politics: మాపై రాజకీయ రంగు పూయకండి.. మమ్మల్ని ఆదుకోండి…ఆందోళన చేస్తున్న వాలంటీర్లు!
Chandra Babu: జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు… ఏపీలో సాధ్యమేనా?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్: నాని
RK Roja: పవన్ దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలువు.. డిప్యూటీ సీఎంకి సవాల్ విసిరిన రోజా?
Nagarjuna: శోభిత ఫ్యామిలీ ఆ ఒక్కటి అడిగింది.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- devotional2 weeks ago
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
- Featured2 weeks ago
YS Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… వీడియో వైరల్!