devotional
Kailasa parvatham mistery : కైలాస పర్వతంపై శివుడు నిజంగా ఉన్నాడా?? ఎందుకని ఎవరూ ఆ పర్వతం ఎక్కలేకపోతున్నారు…!
Published
12 months agoon
Kailasa parvatham mistery : ప్రపంచంలోని ఎత్తయిన పర్వాతాలను చాలా మంది అధిరోహించారు. ఏకంగా ఎవరెస్టును కూడా అధిరోహించారు. కానీ ఎవెరెస్టు కంటే తక్కువ ఎత్తులో ఉండే కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎందుకు ఎక్కలేకపోయారు. అక్కడ అతీత శక్తులు ఉన్నాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మన భారతీయ సంస్కృతి రామాయణం, మహా భారతంను దాటి పక్కకు పోదు. చిన్నతనం నుండి మనం ఏదో ఒక సందర్బంలో రామాయణ, మహా భారత గాధలనే కథలుగా వింటూనే ఉన్నాం. అలా రామాయణంలో రావణుడి గురించి తెలుసుకున్నాం. రావణుడు శివని అపరభక్తుడు. ఆయన ఆత్మలింగాన్ని పొందడానికి ఆయన పది తలలను శివునికి అర్పించారు. ఈ విషయం మనం కథలలో తెలుసుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అన్న విషయం చాలామందికి తెలియదు. అది మరెక్కడో కాదు ఈ కైలాస పర్వతం మీదనే.
కైలాస పర్వతం మీద నిజంగానే శివుడు ఉన్నాడా…
కైలాస పర్వతంకి అసలు ఆ పేరు ఎలా వచ్చిందంటే, కౌలస అనే సంస్కృత పదం నుండి వచ్చింది. కౌలస అనగా స్పటికం అని అర్థం. కైలాస పర్వతం ఇప్పటి టిబెట్ ప్రాంతంలో అనగా నేడు చైనా ఆక్రమిత టిబెట్ లో ఉంది. దాదాపు ఎన్నో కోట్లమంది ప్రజలు ఈ కైలాస పార్వతంను ఆధ్యాత్మిక ప్రాంతంగా భావించి పూజిస్తున్నారు. ఇక ఈ పర్వతం ఎత్తు 6.6 కిలోమీటర్లు. ప్రపంచంలోని ఎన్నో ఎత్తయిన పర్వతాలలో ఇదీ ఒకటి. ఇక ఈ పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిరోహించలేదు కానీ పర్వతపు మొదలుకు వెళ్లి పూజలు చేస్తారు. అక్కడ ఉన్న రెండు సరస్సులు ఒకటి మానస సరోవర్ మరొకటి రాక్షస్థల్. మానస సరోవరం బ్రహ్మ మనసు నుండి పుట్టింది. ఇక ఇక్కడ మునక వేస్తే ఏడు జన్మల పాపాలు పోతాయని నమ్మకం. ఇది సూర్యుని వెలుగుకు ప్రతీక కాగా పక్కన ఉన్న రాక్షస్థల్ ఉప్పు నీటి సరస్సు. ఇది చంద్రుని ఆకారంలో ఉంటుంది. ఇందులో రావణాసురుడు తన ఒక్కోతలను ఒక్కోరోజు బలిగా శివునికి అర్పించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ సరస్సులో ఎవరూ మునగరు.
ఇక మానస సరోవరం లో బ్రహ్మ ముహూర్తం సమయంలో అంటే వేకువ జామున కైలాస పర్వతం నుండి శివుడు వచ్చి స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సాక్ష్యంగా కైలాస పర్వతం నుండి ఆ సమయంలో మానస సరోవరం కు ఒక వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెప్పారు. అయితే ఈ వెలుగు ఎందుకు వస్తోందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇక ఈ పర్వతం వద్ద వృద్దాప్యం త్వరగా వస్తుంది, రెండు వారాలలో పెరగాల్సిన గోర్లు, వెంట్రుకలు 12 గంటలలోనే పెరుగుతాయి దీనికి కారణం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఇది కూడా ఈ పర్వతాన్ని అధిరోహించక పోవడానికి కారణం. రేడియేషన్ అధికంగా ఉండే ఈ పర్వతం అధిరోహించడానికి ప్రయత్నించిన ఎంతో మంది విఫలం అయ్యారు. చైనా ప్రభుత్వం హెలీకాప్టర్ ద్వారా ఈ పర్వతం ఎక్కాలని ప్రయత్నించినా హెలీకాప్టర్ కూలిపోయింది. రెండు సార్లు పర్వతారోహకులకు ఎక్కడానికి అవకాశం కల్పించినా వారు విఫలమయ్యారు. అక్కడికి చేరుకున్న ఎంతో మంది మార్గం మధ్యలోనే అదృశ్యమయ్యారు. దీంతో ఇక ఇప్పుడు ఈ పర్వతాన్ని ఎక్కడాన్ని నిషేదించారు. ఎంతో మంది మత విశ్వాసాలకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
You may like
devotional
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
Published
2 weeks agoon
7 November 2024By
lakshanaKoti Deepotsavam: 2012 నుంచి ఇప్పటివరకు అనగా దాదాపు 11 ఏళ్లుగా ఎన్టీవీ అలాగే భక్తి టీవీ చానల్స్ హైదరాబాద్ వేదికగా ప్రతి ఏడాది కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ కార్యక్రమం కన్నుల పండుగ అత్యంత వైభవంగా జరుగుతూ వస్తోంది. ఇక ఈ ఏడాది కూడా ఆ సమయానికి ఆసన్నమైంది. త్వరలోనే కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా మొదలుకానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి.
కాగా భక్తి టీవీ ఎన్ టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్తీక కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నిర్విరామంగా జరుగుతూ వస్తున్న ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రతి ఏడాది జరిగే లాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించడానికి ఈ సర్వం సిద్ధం చేశారు.
నవంబర్ 9 నుంచి ప్రారంభం..
ఇకపోతే కార్తీకమాసంలో జరిగే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ముఖ్య ఘట్టం అంటే ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు లక్షలాది మంది భక్తులు, ఒకేసారి ఒకే ప్రాంగణంలో ఉండడం. లక్షలాది దీపాలతో ఆ ప్రాంగణమంతా కూడా దీపాల వెలుగులతో విరిగిపోతూ ఉంటుంది. ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్ 9 న నుంచి నవంబర్ 25 వరకు హైదరాబాద్,ఎన్టీఆర్ స్టేడియంలో జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి నగరం నలువైపుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అదేవిధంగా దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు, మఠాధి పతులు, పీఠాధి పతులు, ప్రవచన కర్తలు, హైందవ సమాజ సేవకులు ఇలా వేలాది లక్షలాదిమంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు.
devotional
Lord Srikrishna Mistery : శ్రీ కృష్ణుడి ద్వారకానగరం నిజంగా ఉందా… సముద్రంలో దొరికిన ఆ పార్థివ దేహం కృష్ణుడిదేనా…!?
Published
4 months agoon
5 August 2024By
BhargaviLord SriKrishna mistery : ‘వందే కృష్ణం జగద్గురుమ్, కృష్ణం వందే జగద్గురుమ్..’ ఇది కృష్ణుడిని ఆరాధించేవారు నమ్మే సిద్ధాంతం, ప్రపంచం మొత్తం కృష్ణుడిలోనే ఉంది శ్రీకృష్ణుడే ప్రపంచం. అయితే నిజంగా శ్రీకృష్ణుడు ఉన్నాడా లేక మన పురాణాల్లో పేర్కొన్నది కల్పిత కథా. దీనికి సంబంధించిన పరిశోధనలు అనేకం జరిగాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత నేడు మన ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతోంది. భగవద్గీత హిందువులకు మాత్రమే కాదు నేడు ప్రపంచంలో ఎంతో మంది శ్రీకృష్ణుడి భగవద్గీత భోధనలను అనుసరిస్తున్నారు. మహాభారతం విన్న ఎవరికైనా శ్రీ కృష్ణుడు మంచి వ్యూహకర్త అని అనిపిస్తుంది.
పురావస్తు తవ్వకాల్లో దొరికిన అస్థి పంజరం ఎవరిది…
మహాభారతం నిజమని కురుక్షేత్రం జరిగిన ఆధారాలు లభ్యం కావడంతో మన ఇతిహసం అయిన మహా భారతం కేవలం కల్పితం కాదు నిజం అని ప్రపంచానికి అర్థమైంది. ఇక ఎన్నో ఏళ్లుగా కృష్ణుడు ఏలిన ద్వారకా నగరం గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక వాటి మీద పరిశోధనలు చేస్తూ గుజరాత్ వద్ద అరేబీయా సముద్రం ఒడ్డున భారత పురావస్తు శాఖ తవ్వకాలను నిర్వహించి అనేక విషయాలను కనుగొన్నారు. నిజంగా ద్వారకా నగరం ఉందని ఎన్నో ఆధారాలను కనుగొన్నారు. ఇండియన్ అర్కియాలజిస్ట్లు 2005 లో సముద్ర గర్భంలో తవ్వకాలు మొదలు పెట్టి 2009 లో ద్వారకా నగరానికి సంబందించిన అనేక అవశేషాలను కనుగోన్నారు.
అవి దాదాపు 9500 సంవత్సరాల క్రితం రాళ్లు అని తెలుసుకున్నారు. ఇక ఎన్నో పాత్రలు, నాణాలను పరిశోధకులు కనుగొన్నారు. సముద్రగర్భంలో 9000 ఏళ్ళ క్రితం నటి నాది ఆనవాళ్ళను కనుగొన్నారు. అంతే కాకుండా మహాభారతం కేవలం కల్పితమా లేక నిజంగా జరిగిందా అన్న పరిశోధనల్లో నిజమని నిరూపించే అనేక ఆధారాలను పరిశోధకులు కనుగొన్నారు. ఇక కురుక్షేత్ర సమయంలో మరణించిన ఒక పెద్ద అస్థిపంజరం ను పూరావస్తు శాస్త్రవేత్తలు సముద్రంలో కనుగోన్నారు. ఇక ఈ అస్థి పంజరం ఘటోత్కచుడి అస్థి పంజరం అని నిర్ధారించారు. ఇక కురుక్షేత్రం జరిగిన స్థలం హర్యానా రాష్ట్రంలోని ఒక ప్రాంతం, అక్కడ యుద్ధం జరగడం వల్ల ఎంతో మంది మరణించడం వల్ల రక్తంతో తడిసి అక్కడి మట్టి ఎర్రగా ఉంటుందని చాలా మంది భావిస్తారు. ఇక మహా భారతంలో పేర్కొన్న నగరాలు నేటికీ ఉండటం మహాభారతం జరిగింది అనడానికి అలాగే శ్రీకృష్ణుడు ఉన్నాడు అనడానికి నిదర్శనాలుగా చెప్పవచ్చు.
devotional
Mahesh Babu: మహేష్ బాబు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. నమ్రత కూడా కాదంట తెలుసా?
Published
9 months agoon
9 March 2024By
lakshanaMahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నారనే విషయం తెలియడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇకపోతే మహేష్ బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈయన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించారు. ఈ క్రమంలోనే మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తే ఈ హీరోయిన్లతో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకుంటారని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ మళ్లీ మళ్లీ హీరోయిన్లతో షేర్ చేసుకోవాల్సి వస్తే షేర్ చేసుకుంటానని తెలిపారు. త్రిషతో నటించడం చాలా సులభంగా ఉంటుందని అంతేకాకుండా తనతో నా స్క్రీన్ స్పేస్ బాగుంటుందని తెలిపారు. ఇలా మా ఇద్దరి మధ్య సీన్స్ అద్భుతంగా ఉండడానికి కారణం మా ఇద్దరి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని ఈయన తెలిపారు.
ఫ్రెండ్షిప్ కారణం…
ఇక త్రిష తర్వాత సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తాను ఇష్టపడతానని తెలిపారు. అయితే ఈయన భార్య నమ్రత కూడా హీరోయినే, ఈమెతో కలిసి కూడా మహేష్ బాబు సినిమాలలో నటించారు కానీ ఈయన మాత్రం తన భార్య పేరు చెప్పకుండా త్రిష సమంత అంటూ తనకి ఇష్టమైనటువంటి హీరోయిన్లు మళ్లీమళ్లీ సినిమాలలో నటించాలనుకునే హీరోయిన్ల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
AP Politics: మాపై రాజకీయ రంగు పూయకండి.. మమ్మల్ని ఆదుకోండి…ఆందోళన చేస్తున్న వాలంటీర్లు!
Chandra Babu: జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు… ఏపీలో సాధ్యమేనా?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్: నాని
RK Roja: పవన్ దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలువు.. డిప్యూటీ సీఎంకి సవాల్ విసిరిన రోజా?
Nagarjuna: శోభిత ఫ్యామిలీ ఆ ఒక్కటి అడిగింది.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- devotional2 weeks ago
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
- Featured2 weeks ago
YS Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… వీడియో వైరల్!