సినీ రంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. చిన్న స్థాయి హీరోయిన్ల దగ్గర నుండి నుంచి టాప్‌ హీరోయిన్ల వరకూ సినీ రంగంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిరంగపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య “సుచీ లీక్స్’‌ పేరుతో గాయనీ సుచిత్ర కలకలం సృష్టించింది. నటి శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ నటి తనూశ్రీదత్తా ప్రముఖ నటుడు నానాపటేకర్‌ లాంటి వారి లైంగిక హింసలను బట్టబయలు చేసింది. ఈ వ్యవహారం బాలీవుడ్‌ని కుదిపేసిన విషయం తెలిసిందే. నానాపటేకర్‌పై నటి తనూశ్రీదత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇలాంటి లైంగిక వేధింపుల సంఘటనలు ఒక్కొక్కటి బయటకొస్తున్న నేపధ్యంలో తాజాగా బాలీవుడ్ క్వీన్ ‌ కంగనారనౌత్‌ బీ టౌన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బీ టౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ మాఫియాని చెడుగుడు ఆడేస్తోంది. సుశాంత్ మరణం తర్వాత.. కంగనా డోస్ మరింత పెంచింది. ఇండస్ట్రీ ఏ-లిస్టర్స్ అంటూ ఓ సెక్షన్‌ని ఏకిపారేస్తోంది. ఇన్నాళ్లూ.. ఇండస్ట్రీలో గుట్టుగా సాగిపోయే డ్రగ్ పార్టీల భాగోతాన్ని, కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్నిఈ సిల్వర్ స్క్రీన్ క్వీన్ బయట పెట్టేస్తోంది. తన ట్వీట్స్‌తో.. నెటిజన్లంతా విస్తుపోయే నిజాలను, బాలీవుడ్ పార్టీల్లో కిక్కు వెనకున్న సీక్రెట్స్ ‌ని.. బయటపెట్టేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో జరుగుతున్న లైంగిక దోపిడీ గుట్టువిప్పింది కంగనా.

బాలీవుడ్ సినిమాలలో ఐటెమ్‌ సాంగ్‌ చేసే ఛాన్స్ రావాలన్నా, 2 నిమిషాల సీన్‌లో నటించాలన్నా కూడా ఆ నటి హీరోతో రాత్రంతా గడపాల్సి ఉంటుందని, బాలీవుడ్ లోని నటీమణులపై లైంగిక వాంఛ తీర్చాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ప్రత్యేకించి తానూ ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడటం లేదని, సర్వ సాధారణంగా బీ టౌన్‌లో జరుగుతున్న పరిస్థితుల గురించే మాట్లాడుతున్నానని, ఏ లిస్ట్, బీ లిస్ట్ అలాగే పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అంతా హీరోయిన్స్ తమతో గడపాలని కోరుకుంటారని, షూటింగ్ స్పాట్స్ లో కూడా తమకు భార్యలా నడుచుకోవాలని ఆదేశిస్తుంటారని, సినిమాలు మారుతుంటే హీరోలు మారుతారు తప్ప పరిస్థితి మాత్రం అలాగే ఉంటుందని, ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా సరే సినిమా ఛాన్స్ కోసం ఆ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులకు లైంగికంగా లొంగిపోయి తృప్తి పరచనిదే పనికాదని సంచలనమైన కామెంట్స్ చేసింది ఈ ఫైర్ బ్రాండ్.

అలాగే దేశంలో నెంబర్ 1 చిత్ర పరిశ్రమ “బాలీవుడ్” అని అందరూ అనుకుంటారు. కానీ అది తప్పు. ప్రస్తుతం “టాలీవుడ్” అగ్రస్థానంలోకి ఉంది. ఈమధ్య ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ బాలీవుడ్ కు సవాలు విసురుతోందంటూ బీ టౌన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది మన “ఏక్ నిరంజన్” బ్యూటీ కంగనా రనౌత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here