గాంధీ గొప్ప లీడర్ కావచ్చు.. కానీ గొప్ప భర్త కాదు.. కంగనా సంచలన వ్యాఖ్యలు..?

0
97

కంగనా రనౌత్.. హీరోయిన్ అనేకంటే ఆమెకు వేరే బిరుదులూ చాలానే ఉన్నాయి.. కేరాఫ్ కాంట్రవర్సీ, ఫైర్ బ్రాండ్ అంటూ ఇలా ముద్దు పేర్లు చాలానే ఉన్నాయి. బాలీవుడ్ లో వివాదాలకు కేంద్ర బిందువు అయినా కంగనా రనౌత్ ఇటీవలే చేసిన హంగామా అంత ఇంతా కాదు. పొలిటికల్ సర్కిల్ లో కూడా ఆమె పేరు మారుమోగిపోయింది.. ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అవతలి వారికి కోపం తెప్పిస్తుంది.. మరి ఆమె కావాలని టార్గెట్ చేస్తుందో మరీ తెలియక చేస్తుందో తెలీదు కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

ఆమె నోటిదూలవల్ల ఆమెపై ముంబై లోని రాజకీయ వర్గాలు కూడా విపరీతమైన ఆరోపణలు చేసింది.. అక్కడి మున్సిపాలిటీ కూడా ఆమె ఆఫీస్ భవనాన్ని కూల్చివేసింది.. సుశాంత్ సూసైడ్ తో మొదలైన ఆమె పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది.. తాజాగా ఆమె జాతిపిత మహాత్మ గాంధీ ని కూడా వదల్లేదు.. ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌హాత్మా గాంధీలోని లోపాల‌ను ఎత్తి చూపించారు. ఆయ‌న గురించి ప‌లు సంద‌ర్భాల్లో రాసిన విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. త‌న పిల్ల‌ల‌కు అత‌ను మంచి తండ్రి కాలేక‌పోయార‌ని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో రాశారు.

అంతే కాదు, ప‌లు సంద‌ర్భాల్లో మ‌హాత్మా గాంధి గురించి రాసిన ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న త‌న స‌తీమ‌ణి ప‌ట్ల ఎలా దురుసుగా ప్ర‌వ‌ర్తించేవారో మాట్లాడారు. అతిథుల టాయ్‌లెట్ల‌ను శుభ్రం చేయ‌లేద‌ని త‌న భార్య‌ను ఆయ‌న ఎలా ఇంటి నుంచి గెంటేసేవారో చెప్పారు. ఇన్ని అవ‌ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తిని ఒక దేశం క్ష‌మించింద‌ని, అత‌ను భ‌ర్త‌గా క‌రెక్ట్ గా లేకున్న‌ప్ప‌టికీ మ‌గాడు కాబ‌ట్టే అలా క్ష‌మించ‌గ‌లిగింద‌ని అన్నారు.మ‌న‌సులో ఏం తోచినా గ‌ట్టిగా మాట్లాడ‌టం కంగ‌నకు అల‌వాటు. అయితే ఏకంగా జాతిపిత మీద ఆమె చేసిన వ్యాఖ్య‌లు మాత్రం గ‌ట్టి దుమారాన్నే రేపుతున్నాయి మరి దీనిపై వచ్చే కామెంట్స్ కు ఆమె ఏ సమాధానం చెప్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here