Kapil Dev: టి20 ప్రపంచ కప్ మ్యాచ్లలో భాగంగా టీమిండియా సెమీఫైనల్స్ వరకు వెళ్లి ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓటమిపాలై ఇంటిదారి పట్టారు. ఇలా ఫైనల్ కు వెళ్లి కప్పు కొడుతుందని భావించిన వారికి టీమిండియా షాక్ ఇచ్చిందని చెప్పాలి.ఇలా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలు కావడంతో ఎంతోమంది ఇండియన్ కాకుండా ఇతర దేశాల క్రికెటర్లు సైతం టీమిండియా పై విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ సిరీస్ కి ముందు ఇండియా తప్పనిసరిగా కప్ అందుకుంటుందని ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరికి నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఈ ఓటమిపై ఇండియన్ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఈ మ్యాచ్ గురించి మాట్లాడుతూ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ కామెంట్ చేశారు.
కపిల్ దేవ్ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని టీం ఇండియా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాను చోకర్స్ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే చోకర్స్అంటే ఏంటి అనే విషయానికి వస్తే క్రికెట్ భాషలో టోర్నీలో కీలకమైన మ్యాచులలో అధిక ఒత్తిడిని తట్టుకోలేక ఓడిపోయే జట్టులను చోకర్స్ అంటారు.

Kapil Dev: విమర్శలు పాలవుతున్న టీమిండియా…
ఇలా ఈ పదాన్ని ఇదివరకు సౌత్ ఆఫ్రికాకు ఎక్కువగా ఉపయోగించేవారు. సౌత్ ఆఫ్రికా సైతం ఇలాంటి టోర్నమెంట్స్ లో ఫైనల్స్ వరకు వెళ్లి ఓటమితో వెనుతిరిగేది అయితే తాజాగా కపిల్ దేవ్ సైతం ఈ పదాన్ని టీమిండియాని ఉద్దేశిస్తూ చెప్పడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీమిండియా సైతం 2007 నుంచి నాలుగు సార్లు సెమీస్ కి చేరుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే కప్పు గెలిచిందని, ఇలా ఎక్కువసార్లు ఓటమిపాలు కావడంతో కపిల్ దేవ్ టీమ్ ఇండియాని చోకర్స్ అంటూ వ్యాఖ్యానించారు.



























