Katragadda Prasad : సుమన్ ను జైలు నుండి తీసుకు రావడానికి వాళ్ళ అమ్మ పడిన కష్టం…: కాట్రగడ్డ ప్రసాద్

Katragadda Prasad : డిస్ట్రిబ్యూషన్ తో మొదలు పెట్టి సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ సినిమాలను తీసిన కాట్రగడ్డ ప్రసాద్ గారు ప్రస్తుతం సినిమా నిర్మాణంకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడొస్తున్న నిర్మాతలకు పెద్దగా విలువ ఉండటం లేదని అందుకే తాను సినిమాలకు దూరంగా ఉన్నట్లు ప్రసాద్ గారు చెబుతారు. ఇక అయన సుమన్ కష్ట సమయాల్లో ఉన్నపుడు సినిమా నిర్మాణం తొలిరోజుల్లోనే ఆయనతోనే మొదట సినిమా చేసారు కాట్రగడ్డ ప్రసాద్ గారు. ఇక హీరో సుమన్ గురించి అయన జైలుకి వెళ్లిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపారు.

వాళ్ల అమ్మ చాలా కష్టపడ్డారు…

సుమన్ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో అటు తెలుగు ఇటు తమిళం అంటూ మంచి మార్కెట్ తో ఉన్న సమయంలో కేసులలో ఇరుక్కుని జైలుకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన బెయిల్ మీద బయటికి వచ్చినా చెంగల్ పట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో కేవలం ఏవిఎమ్ స్టూడియో లో మాత్రమే షూటింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అలా ఏవిఎమ్ స్టూడియో వాళ్ళు అనుమతి తెచ్చుకున్నారు.

ఇక డిస్ట్రిబ్యూషన్ నుండి నిర్మాణంలోకి అడుగుపెట్టాలనుకున్న సమయంలో కాట్రగడ్డ ప్రసాద్ గారు మొదట సినిమా చేయాలనుకున్నపుడు సుమన్ గారు మాత్రమే ఖాళీగా ఉన్నారని ఆయనతో సినిమా చేయాలని అనుకున్నారట. సుమన్ గారి మీద ఉన్న దాదాపు కేసులు తీర్పు రిజర్వులో ఉండి ఆయనకు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉండటంతో ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాం అంటూ చెప్పారు. సుమన్ గారి మీద పడిన కేసుల విషయంలో వాళ్ళ అమ్మ చాలా కష్టపడ్డారు. తానే కోర్టులు, పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగి కష్టపడ్డారు అంటూ కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు.