రిస్క్ చేయడం నాకు కొత్త కాదు.. అందుకే ఇప్పుడు ఇలా ఉన్నా : కింగ్ నాగ్

0
102

కింగ్ నాగార్జున తాజాగా నటించిన చిత్రం వైల్డ్ డాగ్ అహిసోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా, మయాంక్‌, ప్రదీప్‌, ప్రకాశ్ కీలకపాత్రల్లో నటించగా.. మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6 గా నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్‌2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. ”నేను ఓ కొత్త ప్రయత్నం, ఓ కొత్త సినిమా తీసిన ప్రతిసారి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి ధన్యవాదాలు.కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సినిమా రిలీజ్‌ చేయాలా? ఆడియన్స్‌ వస్తారా? అనుకున్నాం. కానీ సినిమా బాగుంటే ప్రేక్షకుల సపోర్ట్ తప్పకుండా ఉంటుందని మరోసారి నిరూపితమైంది.కలెక్షన్స్‌ బాగున్నాయని నిర్మా త నిరంజన్‌గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ప్రొత్సహిస్తున్న అభిమానుల అండదండలతోనే నేను కొత్తరకం సినిమాలు చేయగలగుతున్నాను. వారికి ఎప్పటికీ ఋణపడి ఉంటాను. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా అని చాలా మంది అన్నారు. అదే ఈ సినిమాకు నాకు వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్‌. చాలా మంది ఈ ఏజ్‌లో రిస్కులు అవసరమా అన్నారు. నేను రిస్కులు చేయబట్టే ఈ స్టాయికి రాగలిగాను. రిస్క్ చేయడం నాకు కొత్తేమి కాదు..ప్రేమించే పని చేసినప్పుడు శ్రమ ఎప్పుడు ఉండదు.

ఇంత మంచి అప్లాజ్ వస్తున్నందుకు దర్శకుడు సాల్మన్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే మా టీమ్ మెంబర్స్ అందరూ మంచి సపోర్ట్ చేశారు. వారికి మంచి అప్రిసియేషన్ వస్తున్నందుకు హ్యాపీ” అన్నారు..ఇక ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు చిత్రాన్ని ఈ ఏడాది పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నాడు ఈ సీనియర్ హీరో.. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో తెలిపాడు నాగ్..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here