Konda Susmitha Patel : నాది లవ్ మ్యారేజ్… కొండా మురళి కూతురు ఇక్కడ…!

0
97

Konda Susmitha Patel : వరంగల్ రాజకీయాల్లో చర్చించుకోదగినది కొండా దంపతుల రాజాకీయం. నక్సల్ పార్టీ నుండి రాజకీయాల్లోకి వచ్చిన కొండా మురళి, ఆయన భార్య సురేఖ కాంగ్రెస్ పార్టీ లో మండల్ పరిషత్ మెంబెర్ నుండి మంత్రి వరకు ఎదిగారు. కొండా మురళిని చంపించాలని చాలా సార్లు ప్రయత్నాలు జరిగాయి. రెండు వర్గాల మధ్య వర్గపోరుతో మురళి మీద హత్యాయత్నం కూడా జరిగింది. ఇక ఈ విషయాలన్నీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘కొండా’ సినిమా తీసి మరీ చూపించాడు. ఇక ఈ సినిమా గురించి రాజకీయాల్లోకి రావడం గురించి కొండా సుస్మిత మాట్లాడారు అలానే వారి రాజకీయాలతో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను మాట్లాడారు.

పెళ్లి గురించి…

రాజకీయాల్లోకి అడుగుపెట్టి వరంగల్ రాజకీయాల్లో ఎర్రబెల్లిని మట్టికరిపించాలనే ఉద్దేశంతో ఉన్న కొండా సుస్మిత రాజకీయాలే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనది లవ్ మ్యారేజ్ అంటూ వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో తన పెళ్లి పెద్దలు కుదుర్చిన పెళ్లి అంటూ కొండా మురళి బిడ్డ ఇక్కడ అంటూ తెలిపారు. తల్లిదండ్రులది ప్రేమ వివాహం కావడం వల్ల తాతయ్యకు మరణించే లోపు నా పెళ్లి చూడాలని కోరిక ఉండటంతో మావయ్య కొడుకులుద్దరిలో ఎవరో ఒకరితో పెళ్లి చేయాలని అనుకున్నారు.

పెద్ద బావకు అప్పటికే పెళ్లి ఫిక్స్ అవడంతో చిన్న బావతో పెళ్లి ఫిక్స్ చేసారు అంటూ సుస్మిత తన పెళ్లి గురించి చెప్పారు. మెడిసిన్ చదువుతున్న సమయంలో తాను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతుండగా బావ రెండో సంవత్సరం చదివే సమయంలో పెళ్లి కుదిరింది అంటూ చెప్పారు. బావకు చాలా ఓపిక ఎక్కువని తాను నా జీవితంలోకి రావడం నా అదృష్టం అంటూ తెలిపారు సుస్మిత.