“బాషా ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు” ఈ ఒక్క డైలాగ్ తో రజనికాంత్ లైఫే మారిపోయింది. 1995 లో విడుదలైన బాషా సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలిసిందే.. రజని సర్ స్టైల్ ని, హీరోయిజాన్ని వేరేలేవేల్లో నిలబెట్టిన సినిమా బాషా.. దాదాపు 15 నెలల పాటు ఈ సినిమా కేవలం థియేటర్లలో ఆడిందంటే ఒక్కొక్కళ్ళు ఈ సినిమాని ఎన్ని సార్లు చూసుంటారో..రజనీకాంత్ నటనకి ఫిదా అయ్యుంటారో మనం అర్ధం చేస్కోవచ్చు. అసలు ఈ ఒక్క బాషా సినిమా రజకాంత్ గారికి బెస్ట్ యాక్టర్ గా సినిమా ఎక్సప్రెస్ అవార్డు, ఫిలింఫాన్స్ అస్సోసియేషన్ అవార్డు లాంటి ఎన్నో అవార్డులు రివార్డులను తెచ్చిపెట్టడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ సత్తా ఏంటో చూపించిన సినిమా!

బాషా సినిమా స్టోరీ లైన్ దగ్గర నుండి స్క్రీన్ ప్లే, రజనీకాంత్ నటన, ఆయన స్టైల్, రఘువరన్ విలనిజం, నగ్మా అందాలు..దేవా గారి సంగీతం వీళ్లందరినీ ముందుండి నడిపించిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు.. ఇలా వీళ్లందరి కష్టం.. సినిమా ప్రేక్షకులను ఎంతో అలరించింది. రికార్డులను సృష్టించింది. అయితే..ఈ సినిమాని మన తెలుగులో మనందరం మెచ్చే మెగాస్టార్ చిరంజీవి చేస్తే..ఎలా ఉండేది..అదిరిపోయెది కదా!! రజనికాంత్ అంత స్టైల్ గా కాకపోయినా మన మెగాస్టార్ స్టయిల్లో..ఆయన మాస్ ఇమేజ్ కి ఆయన బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా ఈ బాషా సినిమా సరిపోయేది..

అంతేకాదు తమిళ్ లో బాషా షూట్ జరుగుతున్న టైం లో ఇక్కడ మన తెలుగులో గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, ఎస్పీ పరుశురాం, అల్లుడా మజాకా వంటి వరుస సూపర్ డూపర్ హిట్లతో దూసుకెళ్తున్నాడు మన మెగాస్టార్..సరిగ్గా అలాంటి టైంలోనే మెగాస్టార్ చిరంజీవి విజయబాపినీడు కాంబినేషన్ లో 1991 లో విడుదలైన గ్యాంగ్ లీడర్ సూపర్ హిట్ అవ్వడంతో చిరంజీవి అదే డైరెక్టర్ తో మళ్ళీ బిగ్ బాస్ అనే సినిమాను ప్రారంభించారు.

అయితే అప్పుడు ఆ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతుండగా భాషా సినిమా చేస్తున్న దర్శకుడు సురేష్ కృష్ణ చిరంజీవిని కలిసి బాషా సినిమా తెలుగులో మీరు చేస్తే బావుంటుందని కథ కూడా చెప్పాడట.. ఆ కథ విన్న మెగాస్టార్ ఫిదా అయిపోయి వెంటనే బిగ్ బాస్ టైటిల్ తో మనం ఈ సినిమా చేద్దాం అని మాట కూడా చెప్పాడట. అంతేకాదు వెంటనే అల్లు అరవింద్ కి ఈ సినిమా కథ గురించి చెప్పి నాకు బాగా నచ్చింది.. దీనిని తెలుగులో చేసేందుకు రీమేక్ హక్కులు వెంటనే తీసుకో అంటూ బాషా సినిమా హక్కుల బాధ్యత అల్లుకి అప్పజెప్పాడట. అప్పుడు అల్లు అరవింద్ “భాషా” సినిమా నిర్మాతను కలిసి సినిమా రైట్స్ గురించి అడిగితే అతను 40 లక్షలకు అమ్ముతానని చెప్పాడట కానీ అల్లు అరవింద్ గారు లేదు 25 లక్షలు అయితే కొనుక్కుంటాం అంటూ బేరాలాడడం.. అక్కడ బేరం సరిగ్గా కుదరకపోవడం వలన చిరంజీవి ఆ సినిమాని వదిలేసుకోవడం జరిగింది.

బట్ ఏదిఏమైనా ఆ సినిమా గాని మన మెగాస్టార్ చిరంజీవి చేసుంటే ఆ హిట్టు చిరంజీవి గారి సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా ఉండిపోయేది..ఇంకా ఫాన్స్ కూడా పండగ చేసుకునేవారు.. కానీ ఆ సంవత్సరం విజయబాపినీడుతో తీసిన బిగ్ బాస్ సినిమా ప్లాప్ అవ్వడం ఈ బాషా సినిమా ఓకే కాకపోవడంతో చిరు ఆ సంవత్సరం కాస్త డల్ అయ్యారట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here