విలన్ పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగ దగ్గరైన సంపత్ రాజ్ పేరు చెప్పగానే అందరికీ మిర్చి సినిమాయే గుర్తుకొస్తుంది. కానీ ఆయన టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరో సినిమాల్లన్నిటిలోనూ మెయిన్ విలన్ గా కనిపిస్తూ ఉంటారు. విలన్ గా సంపత్ రాజ్ చెప్పే డైలాగ్స్ కి ఏ ప్రేక్షకుడైనా ఫిదా కావాల్సిందే. అయితే తాజా గా సంపత్ రాజ్ మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను చెప్పుకొచ్చారు.

తాను 23 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన భార్యని పెళ్లి చేసుకున్నానని, తన భార్యని పెళ్లి చేసుకున్న సమయంలో ఆమెకి సరిగ్గా 19 ఏళ్ళు ఉన్నాయని అందుకే ఇద్దరి మధ్యా అభిప్రాయ భేధాలు రావటంతో తప్పనిసరి పరిస్థితుల్లో విడిపోవాలని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నామని, అందుకే విడాకులు తీసుకుని ఇద్దరం వేరు వేరుగా ఉంటున్నామని.. కానీ తన కూతురు బాధ్యతను మాత్రం తానే తీసుకున్నట్లు సంపత్ రాజ్ చెప్పుకొచ్చాడు.

అంతేగాక ఇప్పటికీ తమ ఇద్దరి మధ్య మనస్పర్ధలు, విభేదాలు వంటివి ఏమిలేవని ఇప్పటికీ తన కూతురు వాళ్ళ అమ్మ ఇద్తదరు తరచూ కలుస్తూ ఉంటారని అప్పుడప్పుడు తాను కూడా తన మాజీ భార్య యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఉంటానని తెలిపాడు. ఇంతకి సంపత్ భార్య ఎవరనుకుంటారు.? మనందరికి తెలిసిన నటియేనండీ.. శరణ్య. నీరాజనం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె ప్రస్తుతం తల్లిపాత్రలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here