తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ నేపధ్యంలో ఇప్పటికే విద్యాలయాలకు సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే తాజాగా సిఎం కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈ విషయం ఆమె స్వయంగా తన ట్విట్ ద్వారా తెలిపారు.

తన భర్తకు కరోనా పాజిటివ్ ఆని తేలడంతో తన కుటుంబం మొత్తం క్వారంటైన్ లోకి వెళ్లినట్టు తెలిపారు ఎమ్మెల్సీ కవిత. ఆమె భర్త అనీల్ కరోనా బారిన పడటంతో అయన హోం క్వారంటైన్లో ఉన్నారు. “నా భర్తకు కరోన పాజిటివ్ రావడంతో ఆయన హోం క్వారంటైన్ లో వున్నారు. నేను,నా కుటుంబం కూడా క్వారంటైన్ లోకి వెళ్తున్నాం. మేము పబ్లిక్ గా లేదా పర్సనల్ గా ఎవరినీ కలవం. నా కార్యక్రమాలు అన్నీ నా ఆఫీస్ త్వరలో రీషెడ్యూల్ చేస్తుంది.” అంటూ తన ట్విట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here