ఇటీవల మోహన్ బాబు ‘అలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అందులో అతడు ఎన్నో విషయాలను పంచుకున్నారు. తాను సినిమాలోకి రాకముందు పడ్డ ఇబ్బందులను అలీతో షేర్ చేసుకున్నాడు. ఇంకా అతడి చెప్పిన విషయాల్లో ముఖ్యంగా.. సీనియర్ ఎన్టీఆర్, పరిటాల రవి గురించి కొన్ని విషయాలను తెలిపాడు.

అంతేకాదు మోహన్ బాబును సినీ పరిశ్రమలో అయినా.. బయట అయినా ఎవరైనా మాట్లాడాలంటే భయపడిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే దొంగ నా కొడకా అన్నాడట. ఓ రోజు సినిమా కార్యక్రమంలో మోహన్ బాబుతో పాటు సీనియర్ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు వంటి పెద్ద స్థాయి వ్యక్తుల ఉన్న సమక్షంలో.. స్టేజిపైనా ఓ స్టార్ హీరో దొంగ నా కొడుకు అన్నాడు.
అతనెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. మోహన్ బాబుకు, రజనీకాంత్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీళ్లద్దరు కలిసి చేసిన సినిమాల్లో పెద్దరాయుడుకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇలా అతడు ఓ సినిమా వేడుకలో మోహన్ బాబు గురించి మాట్లాడంటూ అనగానే.. వీడు గురించి ఏముంది మాట్లాడేది.. దొంగ నా కొడుకు అన్నాడట.
ఇలా అనే సరికి సీనియర్ ఎన్టీఆర్ ఏంటి ఆ మాటలు అంటూ సీరియస్ అయ్యాడట. ఈ ఇటర్వ్యూలోనే అతడు అలీని కూడా తిట్టాడు. అలీకి కాస్త పొగరు అంటూ అన్నాడు. సినిమాల్లో నటించడానికి రెమ్యూనరేషన్ విషయంలో మాకు చిన్న మనస్పర్థలు వచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అలీతో మోహన్ బాబు ఇంటర్వ్యూ తెగ వైరల్ అయింది.




























