కూరగాయల కోసం అంటూ తన కొడుకును తీసుకొని వెళ్లిన వివాహిత మార్కెట్ కు వెళ్లకుండానే ఓ గెస్ట్‌హౌస్‌కి వెళ్లింది. అక్కడ ఆమె ప్రియుడిని కలిసింది. వాళ్లిద్దరు శృంగారంలో ఉండగా.. తన కొడుకు ఏడ్వడం మొదలు పెట్టాడు. ప్రియుడికి కోపం వచ్చి.. మన మధ్య ఏంటీ నస అంటూ కసురుకున్నాడు. ఆ తల్లికి కూడా తన మూడేళ్ల కుమారుడు ఏడుస్తుండగా చిరాకు వేసింది.

ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉంటాడు… ఛిఛీ అని విసుక్కుంది. ఆ కోపంలో తన కొడుకును వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇద్దరూ కలిసి పిల్లాణ్ని చంపేద్దామని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా పాలలో పురుగుల మందు కలిపారు. తర్వాత బాబుకు పట్టించారు. క్షణాల్లోనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వాళ్లకు అడ్డు లేకపోవడంతో శృంగారంలో మునిగి తేలారు. తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో పిల్లాడ్ని తీసుకొని కూరగాయలను తీసుకొని ఇంటికి వెళ్లింది.
తన కుమారుడిని మంచంపై పడుకోబెట్టి ఇంటి పనులు చేస్తుంది. దీంతో అక్కడకు వాళ్ల తాత వచ్చాడు. పిల్లాడితో ఆడుకుందామని ప్రయత్నిస్తే… పిల్లాడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే తల్లితో సహా అక్కడ అందరూ ఆందోళన చెందారు. వెంటనే గుజరాత్ లోని అమ్మదాబాద్ లో గల శారదాబెన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పిల్లడ్ని ఇచ్చేయండంటూ తల్లి ఏడుస్తూ డ్రామా మొదలు పెట్టింది. అలా పిల్లాణ్ని ఇవ్వలేమనీ… పోలీసులు మాత్రమే ఇస్తారని చెప్పి… కాల్ చేశారు. కాసేపటికి వచ్చిన షాహెర్ కొతాడా నగర పోలీసులు పోస్ట్ మార్టం జరిపించమన్నారు. దీంతో అసలు నిజం బయటకు వచ్చింది.
పిల్లాడి పొట్టలో పురుగుల మందు అవశేషాలు కనిపించాయి. దీంతో తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఆమె నిజం ఒప్పుకుంది. దాంతో… పోలీసుల ముందే ఆమె భర్త ఆమెను చితకబాదబోతే… పోలీసులు అడ్డుకున్నారు. తన కొడుకును తల్లే చంపేసిందని తెలిసి… ఆ తండ్రి అజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషయం ఎలాగోలా తెలుసుకున్న ప్రియుడు భరత్ పోలీసులకు దొరకకుండా పారిపోయాడు. అతని కోసం గాలింపు చేపట్టారు.



























