మురళీ మోహన్, శోభన్ బాబుల మైత్రి వెనక నేటికీ అంతుచిక్కని రహస్యం.?

0
556

శోభన్ బాబు .. టాలీవుడ్ లో దశాబ్దాల పాటు ప్రేక్షకులను తన నటనతో అలరించిన అందగాడు. నేటికీ శోభన్ బాబు పేరు చెబితే మనకు రింగులు తిరిగిన క్రాపుతో అందమైన ముఖమే గుర్తొస్తుంది. జీవన పోరాటంలో పరుగులెట్టడమే కాదు.. ఆ పరుగు ఎప్పుడు ఆపాలో తెలియడం కూడా ఓ కళే అన్న జీవిత సత్యాన్ని శోభన్ బాబును చూసి నవతరం నటీనటులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. సినిమా రంగంలో శోభన్ బాబు కోటీశ్వరుడైనా.. నిజ జీవితంలో ఆయన చాలా పొదుపుగానే బతికేవారు. సినిమాలలో నటించగా తనకొచ్చే ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ లో పెట్టేవారు.

ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలను కూడా అలాగే గడించారు. నేటికీ చెన్నైలో డిమాండ్ ఉన్న స్థలాలు కొన్నిఆయన కుటుంబానికి చెందినవేనని మీడియా సమాచారం. రియల్ ఎస్టేట్ లో తనకున్న అనుభవ సూత్రాలను తన సహ నటుడు మురళీ మోహన్ కు శోభన్ బాబు పదే పదే చెప్పిన సందర్భాలు చాలా వున్నాయని.. ఆ తర్వాతే తాను రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టానని మురళీ మోహన్ ఈమధ్య ఓ సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. భూమిపై పెట్టిన సోమ్ము ఎక్కడికీ పోదని.. సంపాదించే సమయంలోనే భూములు కొనుక్కోవాలని శోభన్ బాబు చెప్పిన సూత్రాన్ని మురళీ మోహన్ ఆచరణలో పెట్టారు.

అందుకే మురళీ మోహన్ జయభేరి సంస్థ పేరుతో హైదరాబాద్ లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేయగలిగారు. వందల ఎకరాలు కొన్నారు. రియల్ ఎస్టేట్ లో అలా ఆయన కొన్న భూములకు మంచి డిమాండ్ కూడా వచ్చింది. అలా శోభన్ బాబు ఇచ్చిన వ్యాపార సూత్రాలతో మురళీ మోహన్ తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకున్నారని స్వయంగా మురళీ మోహనే చెప్పడం మన ఆంధ్రా సోగ్గాడు శోభన్ బాబు గారి మేధాశక్తికి నిదర్శనమని అర్ధం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here