తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రఘు కుంచే కు సినిమాలంటే అమితాసక్తి చిరంజీవి ప్రేరణతో సినిమాల్లోకి అడుగు పెట్టాలనుకున్నాడు. అలా తన డిగ్రీ డిస్కంటిన్యూ చేసి హైదరాబాదుకు వచ్చి బి.ఏ మ్యూజిక్ లో చేరారు. ఆ క్రమంలో సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో పూరి జగన్నాథ్ తో పరిచయం ఏర్పడింది. అప్పటికే పూరిజగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశాలకోసం ఎదురు చూస్తున్నాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం పెరగడంతో పూరి, రఘు ఇద్దరు కోటి కి వెళ్లి అక్కడ సినిమా పుస్తకాలు, సి.డి లు కొనుక్కొని రూమ్ కి వెళ్లి వాటిని చదవడం, చూడటం లాంటివి చేసేవారు.
అలా ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ఎదురుచూసేవారు.

ఒకరోజు రూమ్ లో రఘు ఒక పాట పాడడాన్ని విన్న పూరి తన మొదటి సినిమాలో అవకాశం కల్పిస్తానని రఘుకు చెప్పాడు. అలా వర్మ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి కొన్ని రోజుల తర్వాత అన్ని కుదరడంతో పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్, ప్రకాష్ రాజు కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్టు సినిమా రావడంతో పూరి మొదటి సినిమా ‘బద్రి’లో పాడే అవకాశం రాలేదు. బద్రి సినిమా తర్వాత తన రెండవ సినిమా జగపతిబాబు, నీలాంబరి హీరోహీరోయిన్లుగా నటించిన ‘బాచి’ సినిమాకి చక్రి సంగీతం అందించారు. ఇందులో లక్ష్మీ అనే పాటను పాడే అవకాశం పూరి జగన్నాథ్, రఘుకు కల్పించడం జరిగింది.

ఒకరోజు మృగరాజు సినిమా డబ్బింగ్ జరుగుతున్న సమయంలో రఘు కుంచే చిరంజీవి గారిని చూడడం జరిగింది. ఆ క్రమంలో తను పాడిన బాచి సినిమాలోని పాటను వినండని ఒక సీడీని చిరంజీవి గారికి ఇచ్చారు. అలా ఇవ్వడంతో చిరంజీవి కారులో ప్రయాణిస్తూ లచ్ఛిమి అనే పాటను వినడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి రఘు కుంచెకు ఫోన్ చేసి ఇంత బాగా పాడతావని నేను ఊహించలేదు. పాట చాలా బాగుంది అని చిరంజీవి చెప్పడంతో రఘు కుంచే ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తానూ ఎంతగానో అభిమానించే మెగాస్టార్ చిరంజీవి రఘు కుంచె పాటను మెచ్చుకోవడంతో ఒక్కసారిగా తన కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి.

ఆ రోజంతా తిండి తినకుండా చిరంజీవి ప్రశంసించిన తీరును తన శ్రేయోభిలాషులకు, బంధువులకు చెప్పుకొని ఎంతో ఆనందాన్ని రఘు కుంచే పొందారు. తర్వాత మృగరాజు సినిమాలో మరో పాట పాడే అవకాశాన్ని చిరంజీవి గారు ఇవ్వడంతో రఘు కుంచే మళ్లీ ఎగిరి గంతేసాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ నిర్మించిన ‘బంపర్ ఆఫర్’ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా రఘు కుంచె కు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక పూరి దర్శకత్వంలో వచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో రఘు కు మరో అవకాశం ఇచ్చి పూరి జగన్నాథ్ తన స్నేహాన్ని నిలబెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here