Connect with us

Featured

Balakrishna: అఖండ 2… దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ అందుకోబోతున్న బాలయ్య.. ఫస్ట్ టైం ఇలా?

Published

on

Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం NBK 109 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Advertisement
balakrishnas-film-release

ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా.. బాలకృష్ణ ఎన్నికల సమయంలో సినిమా షూటింగ్ కి కొన్ని నెలల పాటు బ్రేక్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతుంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది సినిమా తర్వాత బాలకృష్ణ తిరిగి బోయపాటి డైరెక్షన్లో అఖండ సీక్వెల్ సినిమాకు కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

బోయపాటి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించారు. ఇక ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణ కుమార్తె నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం బాలయ్య తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

30 కోట్లు..
ఇప్పటివరకు పాతిక కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న బాలయ్య అఖండ 2 సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ పెంచేశారు. ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ కెరియర్ లోనే ఇదే అత్యంత భారీ రెమ్యూనరేషన్ అని చెప్పాలి. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్లో సినిమా అంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కి అయ్యాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Nagavamshi: సినిమా టికెట్ల రేట్లపై నాగ వంశీ సంచలన వ్యాఖ్యలు.. చాలా తక్కువ అంటూ?

Published

on

Nagavamshi: సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా టికెట్ల రేట్లతో పాటు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తెలుపుతున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఒక మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబంతో సహా సినిమా చూసి రావడం అంటే పెరిగిన టికెట్ల రేట్లు కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అయితే ఈ విషయంపై నాగ వంశీ మాట్లాడుతూ ఒక కుటుంబం సినిమా చూడటానికి వెళ్తే వారికి అయ్యే ఖర్చు రూ.1500 . నా దృష్టిలో ఇది చాలా తక్కువ ధర అని ఈయన తెలిపారు.

ఇలా 1500 వందలకే మూడు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ అందించడం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మరి ఎక్కడ దొరకదని ఈయన తెలిపారు. అయితే అదే కుటుంబం షాపింగ్ మాల్ వెళ్తే ఇంతకంటే కూడా మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలా మూడు గంటల ఎంటర్టైన్మెంట్ కోసం 1500 ఖర్చు చేయడం చాలా తక్కువ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

థియేటర్ ఎక్స్పీరియన్స్..
ఇలా సినిమా టికెట్ల రేట్లు తక్కువే అంటూ నాగ వంశీ కామెంట్ చేయడంతో మరికొందరు ఈ వ్యాఖ్యలపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సినిమా టికెట్ల కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తే అక్కడ దొరికే స్నాక్స్ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉంటాయని, ఇవన్నీటిని లెక్కవేస్తే ఒక మధ్యతరగతి వ్యక్తి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోల్పోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Gunturu Kaaram: గుంటూరు కారం సినిమాకు టైటిల్ కరెక్ట్ కాదు.. ఓపెన్ అయిన నాగ వంశీ!

Published

on

Gunturu Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల చివరిగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి సినిమాకు కమిట్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.

Advertisement

ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం ఈ సినిమాకు సక్సెస్ అందలేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా గుంటూరు కారం సినిమా నిర్మాత నాగ వంశీ ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా పట్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా కంటెంట్ పరంగా ఏమాత్రం తప్పులేదని కంటెంట్ వల్ల ఈ సినిమాకు డ్యామేజ్ అవ్వలేదని తెలిపారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ పెట్టడమే పెద్ద డ్యామేజ్ అని తెలిపారు. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ కాదని ఈయన ఓపెన్ అయ్యారు.

నైజాం ఏరియా…
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కేవలం నైజాం ఏరియాలో మాత్రమే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో డ్యామేజ్ జరిగిందని మిగిలిన అన్ని ఏరియాలలోనూ ఈ సినిమా సేఫ్ అయ్యిందని నిర్మాత తెలిపారు. ఇలా గుంటూరు కారం సినిమా మైనస్ ల గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ntr: సమంతనే కావాలి… సమంతతో మరోసారి చిందులు వేయనున్న తారక్!

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం డైరెక్టర్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక సమంత ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.

సమంతనే ఫైనల్..
ఇకపోతే సమంత ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ పాట భారీ స్థాయిలో హిట్ అయింది. అందుకే మరోసారి ఎన్టీఆర్ సినిమాలో కూడా సమంతనే స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావించినట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సైతం సమంతనే ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!