Naveen Polishetty : ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల కోసం వచ్చిన నవీన్ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. అవకాశాల కోసం బాగా తిరిగినా సినిమా ఆఫర్స్ రాకపోవడంతో స్టాండ్ అప్ కామెడీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అలా యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన నవీన్ కు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస అత్రేయ’ సినిమాలో మొదటి సారి హీరోగా ఆఫర్ వచ్చింది. ఇక ఆ తరువాత ‘జాతిరత్నాలు’ సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు.
విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్…
ఇక నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ సినిమాల కంటే ముందు నుండి ఫ్రెండ్స్. ఇద్దరు సినిమా ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ‘లైఫ్ ఇస్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న రోల్ చేసారు. ఇక నవీన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆఫర్స్ అందుకుంటే, విజయ్ ‘పెళ్లిచూపులు’ సినిమాతో ఒక్కసారిగా మంచి ఆఫర్స్ తెచ్చుకున్నాడు. ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఫేట్ మారిపోయింది. విజయ్ పెళ్లి చూపులు సినిమా హిట్ అయినపుడు ఇక వీడు సెటిల్ అయినట్లే ఇండస్ట్రీ లో అని చాలా ఆనందపడ్డాము.
ఇక నా సినిమాల ప్రమోటింగ్ కోసం నేను విజయ్ ని పిలిచడం అవన్నీ మా మధ్య ఉండవు. విజయ్ కి నిజంగా సినిమా నచ్చితే తానే ప్రమోట్ చేస్తాడు. నేను చెప్పాను కదా అని ఏదో ఒక ట్వీట్ పెట్టేసి అలా కాదు అంటూ.. అయినా మా ఇద్దరిది సినిమాల కు సంబంధిచిన ఫ్రెండ్ షిప్ కాదు. సక్సెస్ వచ్చినా మా మధ్య స్నేహం మారదు అంటూ చెప్పాడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం యూవి క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్క తో కలిసి సినిమా చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…