ఇంతకీ నయన్, శివన్ ల పెళ్ళి గుళ్శోనా.. చర్చిలోనా.?

0
378

నయనతార తెలుగు మరియు తమిళ బాషలలో తనదైన నటనను ప్రదర్శిస్తూ, హిట్టూ.. ఫ్లాప్ లను పట్టించుకోకుండా టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. తెలుగులో సీనియర్ నటులతో వరుస చిత్రాలు చేసి సక్సెస్ సాధించిన నయన్, తమిళంలో కుర్ర హీరోలతో కూడా నటించి శభాష్ అనిపించుకుంది. గతంలో నయన్ ప్రేమ వ్యవహారం గురించి అందరికి తెలిసిన విషయమే.

శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన ఈ భామ ఇంతవరకూ పెళ్లి పీటలు మాత్రం ఎక్కలేదు. ఐతే ప్రస్తుతం మాత్రం నయన్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు వినబడుతున్నాయి. ప్రభుదేవాతో బ్రేకప్ అయిన తరువాత తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తో ఆమె ప్రేమలో పడ్డారని చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే..! వీరిద్దరూ ఛాన్స్ దొరికినప్పుడల్లా తమ ఫోటోలు పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. ఈమధ్యనే జరిగిన విఘ్నేశ్‌ పుట్టిన రోజుకు నయనతార ఖరీదైన కారు కొనిచ్చిందని కోలీవుడ్ గాసిప్. వీరు జంటగా విమానాశ్రయంలో చాలా సందర్భాలలో మీడియా కంటబడ్డారు. దీంతో వీరి ప్రేమాయణం నిజమేనని తేలిపోయింది. ఆ మధ్య వీరిద్దరికీ కొచ్చిలోని ఒక చర్చిలో రహస్యంగా వివాహం జరిగిందనే గాసిప్స్ కూడా మీడియాలో వచ్చాయి.

అయితే తాజాగా వారింకా పెళ్లి చేసుకోలేదని, త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోనున్నారని తెలుస్తోంది. తమ ప్రేమ పెళ్ళి విషయాన్ని వారిద్దరే స్వయంగా తెలియజేసే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. పెళ్ళైన తర్వాత వీరిద్దరూ కలిసి చెన్నైలో కొనుక్కున్న ఇంట్లోనే నివాసం వుండబోతున్నారని తాజా సమాచారం. స్టార్స్ లవ్ మ్యారేజ్ అంటేనే అదిరిపోయే రేంజ్ లో ఏర్పాట్లు ఉంటాయి. కాని నయనతార మాత్రం తన పెళ్ళి వేడుక హంగామా గా జరగడం ఇష్టం లేదని సింపుల్ గా తన పెళ్లి కానిచ్చేయాలని భావిస్తుందట. సినిమాల ఆడియో వేడుకలకు హాజరు అయ్యేందుకు ఇబ్బంది పడ్డట్లుగానే అందరి ముందు పెళ్లి చేసుకునేందుకు నయన్ ఇబ్బంది పడుతుందా అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ కూడా వస్తున్నాయి. కారణం ఏమో కాని హిందూ సాంప్రదాయం ప్రకారం మొదట ఒక గుడిలో నయన్ వివాహం జరుగబోతుంది. ఆ తర్వాత చర్చిలో అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. నయన్ పెళ్లి వేడుక కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా పెద్ద నిరాశే అని చెప్పక తప్పదు. చూద్దాం నయనతార పెళ్ళి గుళ్ళో జరుగుతుందో.. చర్చిలో జరుగుతుందో.?!☺️

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here