Connect with us

Featured

Pallavi Prashanth: పుష్ప మేనరిజంతో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. కడిగిపాటిస్తున్న నెటిజెన్స్!

Published

on

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట రైతుబిడ్డ అంటూ సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ అదే క్రేజ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లో ఉన్నంత సేపు ఆటల విషయంలో ప్రతి ఒక్క విషయంలో యాక్టివ్ గా ఉంటూ ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. ఇక నార్మల్ పర్సన్ బిగ్బాస్ టైటిల్ ని గెలవడంతో అతని క్రేజ్ మరింత పెరిగిపోయింది. కానీ బిగ్ బాస్ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు, గొడవలతో అనూహ్యంగా జైలు పాలయ్యాడు పల్లవి ప్రశాంత్. ఆ తర్వాత బెయిల్ పై బయటి కొచ్చి మళ్లీ సోషల్ మీడియాలో బిజీ అయిపోయాడు.

Advertisement

అలాగే పలు టీవీ షోల్లోనూ మెరుస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఒక టీవీ ఛానెల్ ప్రోగ్రాంలో యమా స్టైలిష్ గా కనిపించాడు పల్లవి ప్రశాంత్. ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. బ్లాక్ డ్రెస్ లో పుష్ప రాజ్ తరహాలోనే భారీ గడ్డంతో కనిపించిన ఈ రైతు బిడ్డ స్టైలిష్ కోట్ తో, మీసాలు మెలేస్తూ తగ్గేదేలే అంటూ పోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోనిపై కొందరు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా కొందరు మాత్రం భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో అనగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ప్రశాంత్ అన్న మాటలను మరొకసారి తెరపైకి తీసుకువస్తూ అతనిపై విరుచుకుపడుతున్నారు.

సాయం మరిచావా..

రైతులకు ఇచ్చిన మాట ఏదయ్యా? లక్ష రూపాయల సాయం మర్చిపోతివా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హౌస్ లో ఉన్నప్పుడు బాగానే మాటలు చెప్పావు ఒకసారి గెలవగానే పొగరు వచ్చిందా. లేక సెలబ్రిటీ అయ్యావనా అంటూ కామెంట్ చేస్తూ మండిపడుతున్నారు. ప్రేక్షకులను బాగానే పిచ్చోళ్లను చేశావు అంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. తనకు అండగా నిలిచిన అన్నదాతలకు బిగ్ బాస్ ప్రైజ్ మనీని ఇస్తానంటూ హౌస్ లో ఉన్నప్పుడు, విజేతగా నిలిచినప్పుడు కూడా మాట ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోలేకపోతున్నాడని రైతు బిడ్డపై విమర్శలు వస్తున్నాయి. ఏదో ఒకటి, రెండు కుటుంబాలకు సాయం చేసి చేతులు దులుపుకున్నాడని, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, టీవీషోలతో రైతు బిడ్డ తీరిక లేనంత బిజీగా మారిపోయాడని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Rana: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ పై జోక్స్ వేసిన రానా… ఫైర్ అయిన హరీష్ శంకర్?

Published

on

Rana: ఇటీవల రవితేజ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఏ మాత్రం కలెక్షన్స్ లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.

Advertisement

ఇక ఈ సినిమా డిజాస్టర్ గురించి రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దుబాయిలో జరిగిన ఐఫా ఉత్సవం అవార్డ్స్ ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా జోకులు వేశారు. రానాతో పాటు ఈ కార్యక్రమానికి తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సరదా సరదాగా పలు సినిమాల గురించి మాట్లాడారు.

బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై చూశారు లోయస్ట్ లో చూశారు అని రానా అంటే హైయెస్ట్ అయితే కల్కి మరి లోయస్ట్ లో ఏమిటి అని అడిగితే అదే ఈ మధ్య వచ్చింది కదా మిస్టర్ అంటూ ఉండగా తేజా సజ్జ ఏ అలా మాట్లాడొద్దు అంటూ ఆపారు. అయితే ఇక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి పూర్తిగా చెప్పకపోయినా మిస్టర్ అని చెప్పడంతో కచ్చితంగా రవితేజ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడారని తెలుస్తుంది.

అన్ని రోజులు ఒకేలా ఉండవు..
ఇక ఈ విషయంపై రవితేజ అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ అన్న ఎవరైతే ఇలా మీ సినిమాల గురించి మాట్లాడారో వారే క్లాప్స్ కొట్టాలి అంటే మీరు కచ్చితంగా హిట్ సినిమా చేయాలి అంటూ కామెంట్ చేయగా మరికొందరు డైరెక్టర్ హరీష్ శంకర్ ని టాగ్ చేశారు. రవితేజ గారితో ఒక సినిమా చేయాలి మళ్లీ మేము కాలర్ ఎగరేయాలి దీనికి మీ రిప్లై కావాలన్నా అంటూ పేర్కొన్నారు. దానికి హరీష్ శంకర్ ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇదోటి. అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా ఎవరికైనా అంటూ రాసుకొచ్చారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai pallavi: సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన నాగచైతన్య… తనతో కష్టం అంటూ కామెంట్స్?

Published

on

Sai pallavi: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నాగచైతన్య నటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు సరికొత్త బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని లేడీ పవర్ స్టార్ అనే బిరుదులతో పిలుస్తారు తాజాగా బాక్సాఫీస్ క్వీన్ అంటూ మరో బిరుదుని ఇచ్చారు.

సాయి పల్లవి సినిమా సెట్ లో ఉంటే కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా నా పాత్ర గురించి కూడా ఎంతో క్లారిటీతో ఉంటూ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు. ఇక సాయి పల్లవి తో నటించాలన్న కాస్త కష్టంగా ఉంటుంది.ఆమెతో కలిసి డాన్స్ చేయాలంటే నాకు కాస్త భయం వేస్తుంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా సాయి పల్లవి నటన డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.

డాన్స్ చేయాలంటే భయం..
గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్‌ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశానని అన్నారు. ఈ సినిమా జాలరి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Allu Aravind: అయ్యయ్యో…ఆ స్టార్ హీరోయిన్ ను బన్నీకి చెల్లిని చేసిన అల్లు అరవింద్?

Published

on

Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఏడో తేదీ విడుదలకు సిద్ధమైంది.

Advertisement

ఇలా విడుదల తేదీన ప్రకటించడం కోసం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. ఇటీవల సాయి పల్లవి అమరన్ సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇటీవల తాను అమరన్ సినిమా చూశాను. సాయి పల్లవి తన నటనతో అందరిని అదరగొట్టేసింది. చివరిగా కన్నీళ్ళతో బరువెక్కిన హృదయంతో బయటకు వచ్చాను కారులో కూర్చుని అదే ఎమోషన్ లో సాయి పల్లవికి ఫోన్ చేసి మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు.

కూతురితో సమానం..
నాకు కూతుర్లు లేరు కూతురు కనుక ఉండి ఉంటే సాయి పల్లవి లాగే ఉండాలని కోరుకుంటాను ఆమె నాకు కూతురుతో సమానం అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయ్యయ్యో ఈ స్టార్ హీరోయిన్ పట్టుకొని బన్నీకి చెల్లిని చేశారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!