ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రజలందరినీ భయపెడుతుంది. కరోనా దెబ్బకు ప్రజలు బయటకి వెళ్ళడానికి బయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే బయటకి వెళ్తున్నారు, అలా వెళ్ళిన వారు మాస్క్ లు వేసుకుంటేనే గాని తిరగలేని పరిస్థితిలో వున్నారు.. సామాజిక మాధ్యమాల్లో మరియు వార్తలలో కరోనా వైరస్ గురించి చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చాలా మంది అయితే రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటేనే బయపడుతున్నారు. చైనా దేశంలో అయితే ఈ వైరస్ భారిన పడి చాలా మంది ప్రజలు చనిపోతున్నారు.. అక్కడి నుండి ఎవరిని ఇక్కడకి రానివ్వడం లేదు. వచ్చిన వారికి అన్ని రకాల వైద్యపరీక్షలు చేసి కానీ బయటకి వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.. ఈ వైరస్ జలుబు,దగ్గు వంటి లక్షణాలతో ఒకరి నుండి ఇంకొర్కి వ్యాపిస్తుంది.. దీని వల్ల ప్రజలు మాంసాహారం తినలంటేనే బయపడి కొనడం లేదు. ఈ వైరస్ వల్ల మాంసాహార వ్యాపారం దెబ్బతింటుంది అని వ్యాపారులు వాపోతున్నారు. ఈ వైరస్ కి ఇంకా సైంటిఫిక్ గా ఎటువంటి మెడిసిన్ కనిపెట్టలేదు..

అందరూ కరోనా వైరస్ భయంతో వణికిపోతూ వుంటే ఇపుడు ఏపీ లో కొత్త వైరస్ ఒకటి పుట్టుకొచ్చింది..ఈ వైరస్ వల్ల అనేక సంఖ్యలో కోళ్లు చనిపోతునాయి. తూర్పు గోదావరి జిల్లాలోని తణకు సమీప ప్రాంతాల్లో కోళ్లు గుట్టలు గుట్టలుగా చనిపోతూ వున్నాయి. కరోనా వైరస్ వల్ల కోళ్లు చనిపోతున్నాయేమో అని కోళ్ల వ్యాపారులు బయటపడుతుంటే, అక్కడి వైద్యులు వాటికి పరీక్షలు చేసి అది కరోనా వైరస్ కాదని vvnd అనే కొత్త వైరస్ అని నిర్ధారించారు. చనిపోయిన కోళ్ల ను విక్రయించకుండ పాతిపెట్టెలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.. ఈ వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలో మాంసం విక్రయాలు నిలిపివేశారు.. ప్రజలు కూడా మాంసాహారం తినడానికి ఆసక్తి చూపించడం లేదు. దీని వల్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఏదిఏమైనా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం తెలియజేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here