టీం ఇండియా అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒకడు. ప్రపంచ క్రికెట్ లో బుమ్రా బౌలింగ్ ఎంత స్పెషలో, అయన బౌలింగ్ యాక్షన్ అంతకంటే స్పెషల్… ఇండియన్ క్రికెట్ టీం మెయిన్ బౌలర్ గా ఎదిగిన బుమ్రా తన బౌలింగ్ యాక్షన్ తో అన్ని రకాల ఫార్మెట్లలో రాణిస్తు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుకున్నాడు. ఎన్నో అరుదైన రికార్డులను బ్రమా క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా తను నిలిచాడు. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆసియా బౌలర్‌గా ఘనత సాధించాడు. అంతేకాదు మొన్న జరిగిన న్యూజిలాండ్ తో టీ20ల్లో అత్య‌ధికంగా 7 మెయిడిన్లు విసిరిన బుమ్రా త‌న ఖాతాలో ప్ర‌పంచ రికార్డును జమ చేసుకున్నాడు. గ‌తంలో ఈ రికార్డు శ్రీలంక‌కు చెందిన నువాన్ కుల‌శేఖ‌ర పేరిట ఉండేది. అత‌ను 6 మెయిడిన్లు వేశాడు. 58 మ్యాచ్‌ల కెరీర్‌లో త‌ను ఆరు మెయిడిన్లు వేశాడు. అయితే ఏడు మెయిడిన్లు వేయ‌డానికి బుమ్రా కేవ‌లం 50 మ్యాచ్‌లే తీసుకోవ‌డం విశేషం.

అయితే న్యూజిలాండ్ కి చెందిన ఒక కుర్రాడు బుమ్రా బౌలింగ్ యాక్షన్ ను సేమ్ తో సేమ్ దింపేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఈ వీడియోను తీసి షేర్ చేసింది కివీస్ మాజీ అల్రౌండర్ స్కార్ట్ స్టైరిస్. అచ్చం బుమ్రాలానే వేసవి అంటూ ఆకుర్రాడ్ని అభినందించాడు. అది అలా ఉంటె ప్రస్తుతం టీం ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కివీస్ మాజీ ఆటగాడు సైమన్ డౌల్ రెండో వన్డే ప్రారంభానికి ముందు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బుమ్రాకు చూపించారు. ఈ వీడియో చుసిన బుమ్రా తెగ నవ్వుతున్నాడు. అచ్చం నాలానే బౌలింగ్ చేస్తున్నాడని బుమ్రా కాసేపు నవ్వుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here