Featured

Nithya Menon : అయన నన్ను పెళ్లి చేసుకోమన్నాడు… ఆ ఇండస్ట్రీ నన్ను బ్యాన్ చేస్తానని చెప్పింది : నిత్యా మేనన్

Nithya Menon : ‘అలా మొదలయింది’ సినిమాతో నాని కి జంటగా నటించిన నిత్యా మేనన్ ఆ సినిమాతో తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే హిట్ వచ్చింది కదా అని కమర్షియల్ సినిమాల వైపు చూడకుండా తనకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్తోంది. అలా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకునే నిత్యా మేనన్ ఈ మధ్య భీమ్లా నాయక్ సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అయన నన్ను పెళ్లి చేసుకోమన్నాడు…

ఇటీవల ధనుష్ తో చేస్తున్న సినిమా సమయంలో కాలికి దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల సినిమాల్లో కొంత సమయం గ్యాప్ తీసుకోవాలని నిత్యా అనుకోవడంతో సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసాయి. నిత్యా పెళ్లి చేసుకోబోతోందని అందుకే గ్యాప్ తీసుకుంటోందని సినిమా చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అంటూ నిత్యా మేనన్ తాజా ఇంటర్వ్యూ ల్లో తెలిపింది. ఇన్నిరోజులు విరామం లేకుండా పనిచేయడం వల్ల కొంత గ్యాప్ తీసుకుని రిలాక్స్ అవ్వలనుకుంటున్నట్లు తెలిపింది. మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, మంచి ఫ్యామిలి మ్యాన్ ఎప్పుడు ఇచ్చే సలహా ఒకటే త్వరగా పెళ్లి చేసుకో మంచి ఫ్యామిలీ సెట్ చేసుకో అని చెప్తూనే ఉంటాడు అంటూ చెప్పింది.

ఇక పెళ్లి గురించి ఆలోచన లేదని ఎప్పుడు పెళ్లి జరగాలని ఉంటే అప్పుడు జరుగుతుంది అంతే అంటూ చెప్పింది. ఇక ఒకానొక సమయంలో తల్లికి ఆరోగ్య సమస్యలు రావడం వలన సినిమాలకు గ్యాప్ ఇస్తే నిత్యా డైరెక్టర్లతో రూడ్ గా బిహేవ్ చేసింది, ఇగో చూపించింది అందుకే ఆ ఇండస్ట్రీ నిత్యా ని బ్యాన్ చేసారు అంటూ ఏవేవో కథలను అల్లేశారు. కానీ నేను వాటిని పట్టించుకోను. లేనివి మాట్లాడుతున్నానరంటే వాళ్ళు ఎంత దిగజారిపోయి ఉన్నారో తెలుస్తుంది అలాంటి వారి గురించి నేను తక్కువ అయిపోలేను కదా వాళ్ళ కర్మకు వాళ్లే పోతారని అనుకుంటాను అంటూ చెప్పింది.

Bhargavi

Recent Posts

“లోకేష్ మామా.. నాకు సీటు ఇవ్వండి” చిన్నారి వీడియో కలకలం..

కర్నూలు జిల్లాలో ఓ చిన్నారి చేసిన భావోద్వేగ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చదువుకోవాలన్న తపన…

6 hours ago

దేశంలో కొత్త ఇంధన విప్లవం.. అందుబాటులోకి E85 పెట్రోల్..

దేశంలో ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది. పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్తరకం…

7 hours ago

గుడ్డు ఒక్కటికి రూ.170.. హోటల్ బిల్లు చూసి అతిథి షాక్

ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గది తీసుకున్న ఓ అతిథికి ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు…

7 hours ago

పనిమనిషి నుంచి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. ఖతార్‌లో అరుదైన అంత్యక్రియలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక సాధారణ మహిళ జీవితం, విదేశీ నేలపై అసాధారణమైన మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది.…

8 hours ago

డ్రైవింగ్ లైసెన్స్ 50 ఏళ్లు..? కొత్త ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ

దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చేలా లైసెన్స్…

10 hours ago

బిగ్‌బాస్-10లో వీళ్లే కంటెస్టెంట్లా?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్!

తెలుగు బిగ్‌బాస్ సీజన్-10 ప్రారంభానికి ఇంకా అధికారిక తేదీ ప్రకటించకపోయినా, కంటెస్టెంట్ల జాబితాపై మాత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో…

10 hours ago