తమిళ స్టార్ హీరో విజయ్ తో నివేదా ఓల్డ్ పిక్ వైరల్.. ఇంతకీ ఇది ఏ సినిమాలోది తెలుసా..??

0
63

జెంటిల్ మాన్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన నివేదా థామస్ మొదటి సినిమాతో టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని బాగా ఆకర్షించింది. అలాగే యంగ్ హీరోలకి పర్‌ఫెక్ట్ పేయిర్ అన్న టాక్ తెచ్చుకుంది. కానీ నివేదా థామస్‌లో ఉన్న ఒకే ఒక్క మైనస్ గ్లామర్ రోల్స్‌కి ఓకే చెప్పకపోవడమే. దాంతో కొన్ని సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. అందుకే నివేదా అకౌంట్‌లో తెలుగు సినిమాలు మాత్రమే కాదు మిగతా భాషల సినిమాలు చాలా తక్కువ చేరాయి.

నిన్నుకోరి, జై లవ కుశ, బ్రోచే వారెవరురా, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ లాంటి సినిమాలు చేసింది.జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ ఒక్క సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ నివేదాకి మంచి పేరు తీసుకు వచ్చాయి. అయితే వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఒప్పుకోకపోవడం ..గ్లామర్ హీరోయిన్స్ తాకిడికి నివేదా రేస్‌లో బాగా వెనకబడింది.. తాజాగా బ్రోచేవారెవరురా, దర్బార్‌ లాంటి సూపర్‌హిట్‌ అయినప్పటికీ ఈ భామకు మాత్రం అవకాశాలు రావట్లేదు.. ఇదిలా ఉంటె తాజాగా నివేదా…దళపతి విజయ్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐతే ఆ ఫోటో 2008లో విడుదలైన ‘కురువి’ అనే తమిళ సినిమాలోనిది…

ఇక 2008లో వచ్చిన మలయాళం సినిమా ‘వెరుతే ఒరు భార్య’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన నివేదా తను తమిళంలో చేసిన మొదటి చిత్రం ‘కురువి’తో మంచి పేరు సాధించింది.. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ అయిన దృశ్యం సినిమాకు తమిళ రీమేక్‌గా వచ్చిన పాపనాశం సినిమాతో నివేదాకు అసలైన బ్రేక్‌ వచ్చింది. ఇందులో కమల్‌ హాసన్‌ సుయంబులింగం పాత్ర పోషించగా, నివేదా ఆయన కూతురు సెల్విగా నటించారు. ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న వకీల్‌ సాబ్‌ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది నివేదా.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కి విశేష స్పందన లభించింది..య్ఏప్రిల్ 9 న విడుదల కానున్న ఈ సినిమా అయితే.. సినిమాలో నటించిన నివేదా థామస్ కి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here