అలనాటి స్టార్స్ తో… నేటి మెగాస్టార్.!!

0
337

ఫిల్ము ఇనిస్టిట్యూట్ లో నటనపై శిక్షణ పూర్తయిన తర్వాత చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమా 1978లో విడుదలయింది.

మన ఊరి పాండవులు, కుక్క కాటుకు చెప్పుదెబ్బ లాంటి సినిమాలు చేస్తూ ఉండగా నాటి టాప్ స్టార్స్ తో నటించే అవకాశం మెగాస్టార్ చిరంజీవికి వచ్చింది.

అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యంలో 1980లో మోసగాడు అనే చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శోభన్ బాబు, శ్రీదేవి, చిరంజీవి నటించారు. మోసగాడు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది.

ఎన్టీ రామారావుతో వేటగాడు చిత్రం హిట్ తర్వాత మళ్లీ ఎన్టీ రామారావు తో కె.రాఘవేంద్రరావు 1981లో దేవి ఫిలిం ప్రొడక్షన్ లో దేవి వరప్రసాద్ నిర్మాతగా తిరుగులేని మనిషి చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో అన్న గారు ఎన్టీ రామారావు తో చిరంజీవి నటించడం జరిగింది.

ఇదే సంవత్సరం మహేంద్ర నిర్మాణ సారథ్యంలో లో వాసు దర్శకత్వంలో తోడుదొంగలు చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి హీరోలుగా గీత, మధు మాలిని హీరోయిన్స్ గా నటించడం జరిగింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పర్వాలేదనిపించింది.

1983 సంవత్సరంలో కమల సినీ ఆర్ట్స్ పతాకంపై కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పులి బెబ్బులి సినిమా రూపొందించారు. కృష్ణంరాజు, చిరంజీవి హీరోలుగా జయప్రద, రాధిక హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవికి సినీపరిశ్రమలోకి వచ్చిన చాలా సంవత్సరాలకు అక్కినేని నాగేశ్వరరావు తో నటించే అవకాశం వచ్చింది.

1993లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన మెకానిక్ అల్లుడు సినిమా లో నాగేశ్వరరావు చిరంజీవి కలిసి నటించారు. చిరంజీవికి జోడీగా విజయశాంతి కలిసి చిందులు వేసింది. చిరంజీవితో మొదటి సినిమా స్టేట్ రౌడీ లాంటి హిట్ ఇచ్చినప్పటికీ బి.గోపాల్ మెకానిక్ అల్లుడు తో చిరంజీవికి ఓ ఫ్లాప్ ను ఇచ్చారు. తర్వాత బి.గోపాల్ ఇంద్ర ‌లాంటి ఇండస్ట్రీ హిట్ ను చిరంజీవి ఖాతాలో వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here