Connect with us

Featured

Pawan Kalyan: తిరుపతి లడ్డు అపవిత్రం…11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షలో పవన్ కళ్యాణ్!

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి దీక్ష తీసుకున్నారు. ఈయన 11 రోజులపాటు ఈ ప్రాయశ్చిత్త దీక్షలో ఉండబోతున్నారని తెలుస్తుంది. నేడు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అర్చకుల సమక్షంలో ఈయన దీక్ష తీసుకున్నారు.

Advertisement

ఆలయ అర్చకులు ఈయన చేతికి దీక్షా కంకణం కట్టి దీక్షను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఈ దీక్షను 11 రోజులపాటు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా 11 రోజుల తర్వాత ఈ దీక్షను విరమించబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోవడానికి గల కారణం తిరుపతి లడ్డు అపవిత్రం కావడమేనని తెలుస్తోంది.

గత ప్రభుత్వం తిరుపతి లడ్డు తయారీలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచే ఉపయోగించిన నూనేను కలిపి ప్రసాదంగా తయారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడుతూ వైకాపా నేతలపై వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారాహి అమ్మవారి దీక్ష..
ఇలా నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనె ఉపయోగించడంతో తిరుమల లడ్డు అపవిత్రం అయిందని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చితం దీక్ష కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. 11 రోజులపాటు ఈ దీక్ష పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా దీక్ష తీసుకోవడం సర్వసాధారణం. ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం మరోసారి దీక్ష కొనసాగిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jani Master: జానీ మాస్టర్ కి బిగ్ షాక్… అవార్డు వెనక్కి తీసుకోవాలటూ ఆదేశాలు?

Published

on

Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల అత్యాచార కేసులో భాగంగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఈయన మద్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈయన తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అరెస్టు చేశారు.

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి ఈయన పోలీసు విచారణలో పలు విషయాలను తెలిపారు. ఇకపోతే ఇటీవల జానీ మాస్టర్ కి కోర్టు మద్యంతర బెయిల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ ఆరో తేదీ నుంచి పదవ తేదీ వరకు ఈయనకు బెయిల్ ఇస్తున్నట్టు కోర్ట్ వెల్లడించారు.

ఈ విధంగా జానీ మాస్టర్ బయటకు వస్తున్నారని సంబరపడేలోపు ఈయనకి ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడానికి కంటే ముందుగా ఈయన 70వ జాతీయ అవార్డు ప్రకటనలో భాగంగా ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకోవడం ఇది రెండోసారి.

అవార్డు వెనక్కి…
ఇలా నేషనల్ అవార్డుకు ఎంపికైన తరువాత ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డు సమితి ఈ అవార్డును వెనక్కి తీసుకోబోతున్నారు.మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు కావడంతో కమిటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలా జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు వచ్చిందని సంతోష పడిన అభిమానులకు ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ విషయంపై జానీ మాస్టర్ స్పందన ఎలా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Balakrishna: కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించని బాలయ్య బాబు.. కారణం అదేనా!

Published

on

Balakrishna: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అవి కాస్త టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే. దాంతో ఇప్పటి వరకు ఆమె చేసిన వ్యాఖ్యలపై చాలామంది సెలబ్రిటీలు స్పందించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసాను ఇచ్చారు.

Advertisement

అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు బాలయ్య బాబు. నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా, అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌ గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

కారణాలు అవే అంటూ..

అయితే బాలయ్య బాబు రియాక్ట్‌ కాకపోవడానికి రెండు కారణాలు ఉండవచ్చనీ టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతు దారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు,బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. మరి నిదానంగా అయినా బాలయ్య బాబు ఈ విషయంపై స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Devara 2: దేవర2 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తారక్.. షూటింగ్ అయ్యిందంటూ!

Published

on

Devara 2: కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ మంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు వరకు ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు మరిన్ని కలెక్షన్లను సాధిస్తోంది దేవర సినిమా. ప్రస్తుతం దేవర సినిమా లాభాల బాట పట్టింది. దసరా హాలిడేస్ కూడా ఉండటంతో 500 కోట్ల టార్గెట్ పెట్టుకుంది దేవర.

Advertisement

తాజాగా దేవర మూవీ యూనిట్ సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. ఈ సినిమా విడుదల అవ్వడంతో అభిమానులు దేవర 2 గురించి చర్చించుకుంటున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే దేవర రిలీజ్ సమయంలో ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. బియాండ్ ఫెస్ట్ లో పాల్గొనడం, అక్కడి మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేసారు. హాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర పార్ట్ 2 గురించి, కొరటాల శివ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర రిజల్ట్ బాగుంది. పార్ట్ 2 కూడా ఉంటుంది.

మేజర్ సీన్స్ అయిపోయాయి..

ఆల్రెడీ కథ సిద్దమైపోయింది. దాన్ని ఇంకా బాగా రాసుకోవాలి. దేవర పార్ట్ 2లో ఒక రెండు మేజర్ సీన్స్ కూడా షూటింగ్ అయిపోయింది. డైరెక్టర్ కొరటాల శివకు మొత్తం అన్ని వదిలేసి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకో, హాలిడేకు వెళ్ళు అని చెప్పాను. ఆ తర్వాత వచ్చి మళ్ళీ దేవర 2 మీద వర్క్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా పెద్దగా గొప్పగా అంటుంది అని తెలిపారు తారక్. ఇక ఈ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను మరోసారి వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఇక తారక్ మాటలను బట్టి చూస్తే కొరడాల శివ నెక్స్ట్ సినిమా దేవర2 అని తెలుస్తోంది. పార్ట్2 పూర్తి అయిన తర్వాతనే తదుపరి సినిమాకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవ్వగానే దేవర 2 షూట్ మొదలుపెడతాడని సమాచారం.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!