గత ఏడాది నుంచి కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచంలోని వివిధ దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ ప్రకటించడం పట్ల ఆయా దేశాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే లాక్ డౌన్ నిబంధనలను సడలించారు.తాజా స్పెయిన్‌లో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్‌డౌన్ ఎత్తేశారు. సుమారుగా ఆరు నెలల నుంచి ఇంటికే పరిమితమైన స్పెయిన్ దేశస్థులు ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.

స్పెయిన్లో గతేడాది అక్టోబర్ నుంచి లాక్‌డౌన్‌ అమలులో ఉంది. ఈ క్రమంలోనే కరోనా కేసులు తగ్గడంతో నిబంధనలను తొలగించారు.దీంతో స్పెయిన్ లోని పలు ప్రాంతాలలో ప్రజలు వీధుల్లోకి వచ్చి సందడి చేశారు.ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అదే విధంగా ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి.

లాక్ డౌన్ తొలగించిన నేపథ్యంలో కొన్ని జంటలు వీధుల్లోకి వచ్చి పరస్పర ముద్దులు పెట్టుకున్నారు. కొందరు మాస్కులు లేకుండా సందడి చేశారు.బర్సిలోనాలో బీచ్‌లు జనాలతో కిక్కిరిశాయి. కొన్ని నెలలుగా మూతపడిన బార్లు, రెస్టారెంట్లు కూడా తెరుచుకున్నాయి. రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పటికీబాలేరిక్ ఐలాండ్, క్యానరీ ఐలాండ్, నవర్రా, వాలెన్సియా ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here