Tollywood: సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీల సంపాదన మాత్రమే కాకుండా వారి ఖర్చులు వారు వేసుకునే దుస్తులు తిరిగే కార్లు ఇలా ప్రతి ఒక్కటి లగ్జరీగా ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం వారి సంపాదన మాత్రమే కాకుండా వారి ఖర్చులు అలాగే వాళ్ళు కట్టే ట్యాక్స్ లు కూడా కోట్లలోనే ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలియదు. ఏంటి ట్యాక్స్ లు కోట్లలో ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏడాదికి కోట్లలో ట్యాక్స్ ను పే చేసే హీరోలు చాలామంది ఉన్నారు. అయితే మన టాలీవుడ్ హీరోలలో ఒక హీరో ఏకంగా ఏడాదికి 14 కోట్ల రూపాయలను ట్యాక్స్ పే చేస్తున్నారట.
Advertisement
వినడానికి కాస్త షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు అంత ట్యాక్స్ పే చేస్తున్నారు. అన్న వివరాల్లోకి వెళితే.. తాజాగా ఫార్చూన్ ఇండియా సంస్థ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ పే చేసిన సెలబ్రిటీల లిస్ట్ విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి కేవలం ఒక్క హీరోకు మాత్రమే చోటు దక్కింది. ఆ హీరో మరెవరో కాదు పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి అల్లు అర్జున్ ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ కట్టి టాలీవుడ్ లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా టాప్ ప్లేస్ లో నిలిచాడు బన్నీ. చాలామంది ఈ వార్త విని షాక్ అవుతున్నారు.
కేవలం ట్యాక్స్ లకి ఏడాదికి 14 కోట్లు కడుతున్నాడు అంటే ఇక అల్లు అర్జున్ సంపాదన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కొక్క సినిమాకు దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే మరోవైపు కమర్షియల్ యాడ్స్ తో పాటు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ విధంగా రెండు చేతుల అల్లు అర్జున్ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ స్టార్ మారిపోవడంతో తన రెమ్యూనరేషన్ ను పెంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వ్యాపారంగంలోనూ దూసుకుపోతున్నారు అల్లు అర్జున్. ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్, రెస్టారెంట్ చైన్ అయిన బఫెలో వైల్డ్ వింగ్స్ కోసం అల్లు అర్జున్ ఫ్రాంచైజీని కలిగి ఉన్నారు.
బాలీవుడ్ లో టాప్ వన్ లో ఆ హీరో…
Advertisement
అలాగే ప్రముఖ ప్లాట్‌ఫారమ్ అయిన ఆహాకు అల్లు అర్జున్ కో ఫౌండర్ గా ఉన్నారు. అల్లు స్టూడియోస్, ఏఏఏ సినిమాస్ అనే ఆధునిక మల్టీప్లెక్స్ ద్వారా కూడా అల్లు అర్జున్ భారీగా సంపాదిస్తున్నాడు. అందుకే ఆ స్థాయిలో ట్యాక్స్ కడుతున్నాడని అంటున్నారు. సంపాదన ఏ రేంజ్ లో ఉందో ట్యాక్స్ లు కట్టడం కూడా అదే రేంజ్ లో ఉంది. కాగా ఈ వార్త విన్న అభిమానులు షాక్ అవుతున్నారు. కాగా ఈ ప్లేస్ లో బాలీవుడ్ లో అగ్రస్థానంలో నిలిచారు షారుక్ ఖాన్. ఈయన ఏకంగా కళ్ళు చెదిరే విధంగా 92 కోట్ల రూపాయలను ట్యాక్స్ పే చేస్తున్నారట. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఏడాదికి 80 కోట్లు ట్యాక్స్ పే చేస్తున్నారట.
Nagavamshi: సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సినిమా టికెట్ల రేట్ల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారడంతో సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సినిమా టికెట్ల రేట్లతో పాటు బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తెలుపుతున్నారు.
Advertisement
ఈ క్రమంలోనే ఒక మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబంతో సహా సినిమా చూసి రావడం అంటే పెరిగిన టికెట్ల రేట్లు కారణంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అయితే ఈ విషయంపై నాగ వంశీ మాట్లాడుతూ ఒక కుటుంబం సినిమా చూడటానికి వెళ్తే వారికి అయ్యే ఖర్చు రూ.1500 . నా దృష్టిలో ఇది చాలా తక్కువ ధర అని ఈయన తెలిపారు.
ఇలా 1500 వందలకే మూడు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ అందించడం అంటే మామూలు విషయం కాదు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మరి ఎక్కడ దొరకదని ఈయన తెలిపారు. అయితే అదే కుటుంబం షాపింగ్ మాల్ వెళ్తే ఇంతకంటే కూడా మరింత ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలా మూడు గంటల ఎంటర్టైన్మెంట్ కోసం 1500 ఖర్చు చేయడం చాలా తక్కువ అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
థియేటర్ ఎక్స్పీరియన్స్.. ఇలా సినిమా టికెట్ల రేట్లు తక్కువే అంటూ నాగ వంశీ కామెంట్ చేయడంతో మరికొందరు ఈ వ్యాఖ్యలపై విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సినిమా టికెట్ల కోసమే ఈ స్థాయిలో ఖర్చు చేస్తే అక్కడ దొరికే స్నాక్స్ రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉంటాయని, ఇవన్నీటిని లెక్కవేస్తే ఒక మధ్యతరగతి వ్యక్తి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోల్పోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Gunturu Kaaram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల చివరిగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా తర్వాత ఈయన రాజమౌళి సినిమాకు కమిట్ కావడంతో ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.
Advertisement
ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం ఈ సినిమాకు సక్సెస్ అందలేదని చెప్పాలి. ఇకపోతే తాజాగా గుంటూరు కారం సినిమా నిర్మాత నాగ వంశీ ఓ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా పట్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గుంటూరు కారం సినిమా కంటెంట్ పరంగా ఏమాత్రం తప్పులేదని కంటెంట్ వల్ల ఈ సినిమాకు డ్యామేజ్ అవ్వలేదని తెలిపారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ పెట్టడమే పెద్ద డ్యామేజ్ అని తెలిపారు. ఈ సినిమాకు ఈ టైటిల్ కరెక్ట్ కాదని ఈయన ఓపెన్ అయ్యారు.
నైజాం ఏరియా… ఇక కలెక్షన్ల విషయానికి వస్తే కేవలం నైజాం ఏరియాలో మాత్రమే ఈ సినిమా కలెక్షన్ల విషయంలో డ్యామేజ్ జరిగిందని మిగిలిన అన్ని ఏరియాలలోనూ ఈ సినిమా సేఫ్ అయ్యిందని నిర్మాత తెలిపారు. ఇలా గుంటూరు కారం సినిమా మైనస్ ల గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Advertisement
ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం డైరెక్టర్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ ఒక స్పెషల్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక సమంత ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.
సమంతనే ఫైనల్.. ఇకపోతే సమంత ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ పాట భారీ స్థాయిలో హిట్ అయింది. అందుకే మరోసారి ఎన్టీఆర్ సినిమాలో కూడా సమంతనే స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ప్రశాంత్ నీల్ భావించినట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ సైతం సమంతనే ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.