Connect with us

Featured

AP Politics: బాబు నీ ఆస్తులు నీ తమ్ముడికి పంచావా.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని?

Published

on

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైయస్ జగన్ ఆస్తుల గురించి పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతున్నాయి. ఎలాగైనా తిరిగి ఆయన బెయిల్ రద్దు చేయించి తనని జైలుకు పంపించేలా షర్మిల కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో వైకాపా నేతలు మండిపడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై పేర్ని నాని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తండ్రి సంపాదించిన ఆస్తిలో సొంత చెల్లికి వాటా ఇవ్వలేవా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ పై విరుచుకుపడ్డారు. ఇదే విషయం గురించి పేర్ని నాని మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తన ఆస్తిలో తన తమ్ముడికి అలాగే తన చెల్లికి వాటా ఇచ్చారా?జగన్, భారతి తమ పేర్ల మీద ఉన్న ఆస్తులను వైఎస్ జగన్ అంతకు ముందే పంచి పెట్టారన్నారు. వైఎస్ షర్మిలకు పెళ్లయిన ఇన్నాళ్లకు, వైఎస్ తండ్రి చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు షర్మిలకు ఆస్తులు గుర్తుకు వచ్చాయా అంటూ ప్రశ్నించారు.

2019లోనే వైఎస్ షర్మిలకు ఆస్తి ఇస్తున్నట్లు ఎంవోయూ రాసుకున్నారని అన్నారు. భారతి సిమెంట్ లో నలభై శాతం, సరస్వతి పవర్ లోనూ వాటా ఇస్తానని ఒప్పందంలో రాసుకున్నారు.ఈడీ అటాచ్‌మెంట్ అయిపోయిన వెంటనే ఒప్పందం రాసుకున్నారని పేర్ని నాని తెలిపారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లన్నీ తన వద్దనే ఉంటాయని, ఈడీ కేసులన్నీ అయిపోయిన తర్వాత ఆస్తులను బదలాయిస్తానని తెలిపారని పేర్ని నాని గుర్తు చేశారు.

బెయిల్ రద్దు..
ఆ ఆస్తులన్నీ ఈడీ అటాచ్ అయ్యాయనే విషయం షర్మిలకు తెలియదా పక్కింట్లో ఆస్తుల గురించి నీకెందుకు చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను కనుక కదిలిస్తే లావాదేవీలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో కోర్టులో మరొక పిటిషన్ వేస్తే కనుక కోర్టు జగన్ బెయిల్ రద్దు చేయడానికి అవకాశం ఉంది. తద్వార తిరిగి జగన్ జైలు పంపించాలనే షర్మిలతో ఆస్తి విషయంలో చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారంటూ పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Manchu Lakshmi: ఆ మాట చెప్పగానే ప్రభాస్ ఎంత డబ్బు కావాలన్నాడు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్?

Published

on

Manchu Lakshmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మోహన్ బాబు వారసురాలుగా మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే ఈమె ఇండస్ట్రీలో ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే మంచు కుటుంబానికి ప్రభాస్ చాలా సన్నిహితుడు అని చెప్పాలి ముఖ్యంగా మోహన్ బాబు ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఉంది సరదాగా ప్రభాస్ మోహన్ బాబుని బావ అంటూ పిలుస్తూ ఉంటారు.

Advertisement

నిజానికి వీరిద్దరూ కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారు. ఆ సినిమాలో త్రిషకు అన్నయ్య పాత్రలో మోహన్ బాబు నటించిన ప్రభాస్ తనని బావ అంటూ పిలుస్తారు అప్పటినుంచి మోహన్ బాబుతో ఎప్పుడు మాట్లాడిన బావ అంటూ మాట్లాడుతూ ఉంటారు.. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ మాకు చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. మా కుటుంబం కోసం ఏం అడిగినా కాదనరని మంచు లక్ష్మి తెలిపారు. ఈ క్రమంలోనే ఒకసారి నేను టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమం కోసం ప్రభాస్ ను ఒక సహాయం అడిగాను.

ఫ్యామిలీ ఫ్రెండ్..
ఇలా టీచ్ ఫర్ చేంజ్ గురించి చెప్పడంతో వెంటనే ప్రభాస్ ఎంత డబ్బు కావాలో చెప్పు అంటూ ఒకటే మాట అడిగారు. అయితే నేను డబ్బు కాకుండా మీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా మా సంస్థ గురించి ఒక పోస్ట్ చేయమని అడిగాను అలా అడిగిన వెంటనే ప్రభాస్ ఆ పని చేసి పెట్టారంటూ ప్రభాస్ గురించి మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Krish: ఘనంగా డైరెక్టర్ క్రిష్ రెండో వివాహం.. రెండో భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Published

on

Krish: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు మాత్రమే కాదు సాధారణ వ్యక్తులు కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్రిష్ జాగర్లమూడి సైతం రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

గత కొద్దిరోజులుగా ఈయన రెండో పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు అయితే నిన్న ఈయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ క్రిష్ హైదరాబాద్ కి చెందిన గైనకాలజిస్ట్ చల్లా ప్రీతి అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఫోటోలను వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలైందని తెలియజేశారు. ఇక ఈయన 2016 వ సంవత్సరంలో డాక్టర్ రమ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇద్దరూ డాక్టర్లే..
అప్పట్లో డైరెక్టర్ క్రిష్ మరొక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల రమ్య విడాకులు ఇచ్చిందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఈయన రెండో వివాహం చేసుకున్నారు. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు కూడా డాక్టర్లు కావటం విశేషం. అయితే ప్రీతికి 11 సంవత్సరాల వయసుగల కుమారుడు కూడా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ntr: అమ్మ అందుకే బయటకు రాదు.. తల్లిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు?

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే హిట్ కొట్టారు.

Advertisement

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఎన్టీఆర్ నటనకు కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఫాన్స్ అనే చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఎన్టీఆర్ నటన డాన్స్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇలా నేడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం తన తల్లి శాలిని అని చెప్పాలి.

ఇలా తన కొడుకు నేడు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ శాలిని మాత్రం ఎప్పుడూ కూడా తన కొడుకు సినిమా వేడుకలకు లేదంటే ఇతర కార్యక్రమాలలో కనిపించరు. ఈ విషయం గురించి తాజాగా షాలిని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం అమ్మ అని చెప్పాలి.

ఒంటరిగా..
అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఎలాంటి బాధ తెలియకుండా పెంచలేదు ఏ విషయమైనా నేను తెలుసుకోవాలి దాని వెనక కష్టం తెలుసుకోవాలని ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒంటరిగా పంపించేది.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు. కష్టాల నడుమనే ఎదగడం గొప్పదనం అని చెబుతుండేది. కష్టపడ్డ వారే ప్రతిఫలం అనుభవించాలి అంటుండేది. అందుకే నాకు హీరోగా ఎంత మంచి పేరు వచ్చిన అమ్మ మాత్రం బయటకు రాదు కష్టం నీదే ప్రతిఫలం కూడా నీదే అని చెబుతుంది అంటూ తన తల్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!