Connect with us

Featured

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు…అదే ప్రధాన కారణమా?

Published

on

Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు టైం చాలా బాడ్ గా నడుస్తుందని చెప్పాలి. ఈయన కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయన పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదు కావడంతో జైలు పాలు అయ్యారు. ఇక నేషనల్ అవార్డుకు ఎంపికైన జానీ మాస్టర్ అవార్డు అందుకోవడం కోసం బెయిల్ ఇవ్వాలని కోర్టులో తన భార్య పిటీషన్ ఇచ్చారు..

Advertisement

మరి కాసేపట్లో ఈయన జైలు నుంచి బయటకు వస్తారన్న నేపథ్యంలో నేషనల్ అవార్డు కమిటీ తనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో అవార్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈయన బెయిల్ కూడా రద్దు అయ్యింది.మళ్ళీ వెంటనే బెయిల్ కోసం మరోసారి అప్పీల్ చేయగా కేసు విచారణలో ఉన్న దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది.

ఈయనపై లైంగిక ఆరోపణలు అలాగే అత్యాచార కేసులు నమోదు కావడంతో బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించిందని తెలుస్తోంది. మరోవైపు ఈయనకు బెయిల్ రాకపోవడమే కాకుండా తన తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే. ఈమెకు గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు.

బెయిల్ రద్దు..
ఇలా జానీ మాస్టర్ కు వ్యక్తిగతంగా అలాగే వృత్తిపరమైన విషయాలలో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంతో అభిమానులు కూడా కంగారు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కేసు జానీ మాస్టర్ కెరియర్ పై కూడా కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం బెయిల్ పిటీషన్ కొట్టి వేసిన కోర్ట్ ఈయనకు ఎప్పుడు బెయిల్ మంజూరు చేస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Manchu Lakshmi: ఆ మాట చెప్పగానే ప్రభాస్ ఎంత డబ్బు కావాలన్నాడు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్?

Published

on

Manchu Lakshmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మోహన్ బాబు వారసురాలుగా మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే ఈమె ఇండస్ట్రీలో ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే మంచు కుటుంబానికి ప్రభాస్ చాలా సన్నిహితుడు అని చెప్పాలి ముఖ్యంగా మోహన్ బాబు ప్రభాస్ మధ్య మంచి అనుబంధం ఉంది సరదాగా ప్రభాస్ మోహన్ బాబుని బావ అంటూ పిలుస్తూ ఉంటారు.

Advertisement

నిజానికి వీరిద్దరూ కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారు. ఆ సినిమాలో త్రిషకు అన్నయ్య పాత్రలో మోహన్ బాబు నటించిన ప్రభాస్ తనని బావ అంటూ పిలుస్తారు అప్పటినుంచి మోహన్ బాబుతో ఎప్పుడు మాట్లాడిన బావ అంటూ మాట్లాడుతూ ఉంటారు.. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రభాస్ మాకు చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలిపారు. మా కుటుంబం కోసం ఏం అడిగినా కాదనరని మంచు లక్ష్మి తెలిపారు. ఈ క్రమంలోనే ఒకసారి నేను టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమం కోసం ప్రభాస్ ను ఒక సహాయం అడిగాను.

ఫ్యామిలీ ఫ్రెండ్..
ఇలా టీచ్ ఫర్ చేంజ్ గురించి చెప్పడంతో వెంటనే ప్రభాస్ ఎంత డబ్బు కావాలో చెప్పు అంటూ ఒకటే మాట అడిగారు. అయితే నేను డబ్బు కాకుండా మీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా మా సంస్థ గురించి ఒక పోస్ట్ చేయమని అడిగాను అలా అడిగిన వెంటనే ప్రభాస్ ఆ పని చేసి పెట్టారంటూ ప్రభాస్ గురించి మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Krish: ఘనంగా డైరెక్టర్ క్రిష్ రెండో వివాహం.. రెండో భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Published

on

Krish: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు మాత్రమే కాదు సాధారణ వ్యక్తులు కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్రిష్ జాగర్లమూడి సైతం రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

గత కొద్దిరోజులుగా ఈయన రెండో పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు అయితే నిన్న ఈయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ క్రిష్ హైదరాబాద్ కి చెందిన గైనకాలజిస్ట్ చల్లా ప్రీతి అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఫోటోలను వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలైందని తెలియజేశారు. ఇక ఈయన 2016 వ సంవత్సరంలో డాక్టర్ రమ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోయారు.

ఇద్దరూ డాక్టర్లే..
అప్పట్లో డైరెక్టర్ క్రిష్ మరొక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల రమ్య విడాకులు ఇచ్చిందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఈయన రెండో వివాహం చేసుకున్నారు. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు కూడా డాక్టర్లు కావటం విశేషం. అయితే ప్రీతికి 11 సంవత్సరాల వయసుగల కుమారుడు కూడా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ntr: అమ్మ అందుకే బయటకు రాదు.. తల్లిపై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు?

Published

on

Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం అతి చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే హిట్ కొట్టారు.

Advertisement

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఎన్టీఆర్ నటనకు కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఫాన్స్ అనే చెప్పాలి. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు ఎన్టీఆర్ నటన డాన్స్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇలా నేడు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం తన తల్లి శాలిని అని చెప్పాలి.

ఇలా తన కొడుకు నేడు ఈ స్థాయిలో ఉన్నప్పటికీ శాలిని మాత్రం ఎప్పుడూ కూడా తన కొడుకు సినిమా వేడుకలకు లేదంటే ఇతర కార్యక్రమాలలో కనిపించరు. ఈ విషయం గురించి తాజాగా షాలిని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ నేడు నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం అమ్మ అని చెప్పాలి.

ఒంటరిగా..
అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా ఎలాంటి బాధ తెలియకుండా పెంచలేదు ఏ విషయమైనా నేను తెలుసుకోవాలి దాని వెనక కష్టం తెలుసుకోవాలని ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒంటరిగా పంపించేది.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు. కష్టాల నడుమనే ఎదగడం గొప్పదనం అని చెబుతుండేది. కష్టపడ్డ వారే ప్రతిఫలం అనుభవించాలి అంటుండేది. అందుకే నాకు హీరోగా ఎంత మంచి పేరు వచ్చిన అమ్మ మాత్రం బయటకు రాదు కష్టం నీదే ప్రతిఫలం కూడా నీదే అని చెబుతుంది అంటూ తన తల్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!