బాక్సాఫీస్‌ ను కళకళలాడించే జిగేలు రాణి. తన అందాల ఆరబోతతో వెండితెరపై వెన్నెల పూయించే అరవింద.. ఈ తరం శ్రీదేవి.. పూజా హెగ్డే మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన పూజా ఎక్కువగా టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తుంటుంది. అందాల పోటీలలో ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2010లో రెండవ రన్నరప్‌గా కిరీటాన్ని సాధించింది.

తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకుని ఎన్నో సూపర్ హిట్స్ ను అందుకుని 2020 సంక్రాంతికి ‘అల వైకుంఠ పురంలో” చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రముఖ డైరెక్టర్ అడ్డాల చంటి డైరెక్షన్ లో వచ్చిన “ముకుంద” చిత్రంతో పక్కింటి అమ్మాయిలా టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన కన్నడ బ్యూటీ పూజా హెగ్డే, DJ చిత్రంలోని బికినీతో పాపులరైంది.  టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల చిత్రాలలో నటించి మెప్పించింది.  ప్రస్తుతం ప్రభాస్ తో ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తుంది. ఈవిధంగా వరసగా సినిమాల్లో నటిస్తూ దూకుడు మీద ఉన్న పూజా, ఇంకా మరికొందరు స్టార్ హీరోలతో జతకట్టబోతోంది.

కరోనా లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న పూజా తాజాగా షేర్ చేసిన ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలు పూజా తన స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ కలసి దిగినవి కావడంతో పూజా చాలా క్యూట్ గా ఉందంటూ ఫాన్స్, నెటిజన్స్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో పూజా హెగ్డే స్కూల్ డేస్ ఫోటోలు బాగా వైరలవుతున్నాయి. కెకె రాధాకృష్ణ డైరెక్షన్ లో పస్తుస్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా మరోప్రక్క అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here