రామ్ గోపాల్ వర్మకు పట్టపగలే చుక్కలు చూపించిన పూనం కౌర్ !

0
1707

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ సరబ్ జిత్ సింగ్, సుఖ్-ప్రీత్ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తర్వాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది.

2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన “మాయాజాలం” చిత్రంతో తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, శౌర్యం, గగనం మొదలైన చిత్రాలలో నటించిన పూనమ్ ఈమధ్య అవకాల్లేకపోవడంతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక సంచలనమైన టాపిక్ కు తెర తీస్తూనే వుంటుంది. తాజాగా నటి పూనమ్ కౌర్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ సంచలనమైన కామెంట్స్ ను షేర్ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో తన తదుపరి సినిమా “పవర్ స్టార్” అని టైటిల్ ప్రకటించి ఆ టైటిల్ తో పాటు ఆయన పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తి వీడియోను కూడా షేర్ చేస్తూ “ఇతడే నా పవర్ స్టార్” అని పోస్ట్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఇంకా తన పోస్ట్ కు హైప్ ను క్రియేట్ చేస్తూ ఈ సినిమాలో “పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌” వంటి పాత్రలు కూడా ఉంటాయని ట్వీట్ చేశాడు.

అయితే ఆ ట్వీట్‌ను చదివిన హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ.. “మీ “పవర్ స్టార్” మూవీలో ఆర్జీవీ అనే పాత్రను కూడా చేర్చండి. ఆయన అమ్మాయిల మానసిక బలహీనతలను కనుగొనడంలో నిష్ణాతుడు. అసభ్యకరమైన భాషను ఉపయోగించమని భలే ప్రేరేపిస్తారు. సోషల్ మీడియాలోతనే పోస్ట్ చేస్తున్నట్టుగా ట్వీట్లను పంపి షేర్ చేయమంటారు. ఆర్జీవీని నా చిన్నపుడు చాలా గౌరవించేదాన్ని.. కానీ ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాను” అంటూ పూనమ్ ట్వీట్ చేయగానే నెటిజన్లు షాకయ్యారు.

వాళ్ళంతా ఆ షాక్ నుండి తేరుకునేలోపే పూనమ్ మరో ట్వీట్ చేస్తూ ”నేను ఆ డైరెక్టర్ చేసిన ఫోన్ కాల్స్ రికార్డు చేసి ఉంటే బాగుండేది. ఆర్జీవీ నాకు ఫోన్ చేసి ఓ వ్యక్తి గురించి మాట్లాడాలని గంటల తరబడి నా బ్రెయిన్ ను వాష్ చేసేవాడు. నాకు ట్వీట్లు పంపి షేర్ చేయమనేవాడు. ఆ ట్వీట్లన్నిటినీ ఆర్జీవీ టార్గెట్ చేసిన ఆ వ్యక్తికి సంబంధించిన పార్టీ ఖాతాకి పంపించాను. థాంక్ గాడ్ మీడియాలో కొందరైనా నిజాయితీగా ఉన్నారు” అంటూ ట్వీట్ చేసింది. అదండి సంగతి..

నేటి వరకూ రామ్ గోపాల్ వర్మయే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అనుకునేవాళ్ళం కానీ ఆడది ఆటంబాంబుతో సమానమని రామ్ గోపాల్ వర్మకే కౌంటర్ ఇచ్చిందంటే పూనమ్ కౌర్ లో మంచి విషయమే వుందన్నమాట..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here