టాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటికే నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులతోబిజీగా ఉన్న ఈ హీరో ఇప్పుడు మరో హాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో నటించబోతున్నాడట.. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే.. హాలీవుడ్ యాక్షన్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ కెరీర్ లో సూపర్‌ హిట్‌ చిత్రం ‘రాంబో’. ఈ సినిమా పూర్తి యాక్షన్ తో నడుస్తుంది. రాంబో పాత్రను సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఐకానిక్ పాత్ర, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే నాలుగు భాగాలుగా రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సీరీస్ త్వరలో ఇండియన్ స్క్రీన్ మీద సందడి చేయనుంది.

బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, రాంబో సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాంబో సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సిద్దార్థ్, ఇండియన్ వర్షన్కు కావాల్సిన మార్పులు చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ రీమేక్లో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించే అవకాశం ఉంది. ప్రభాస్ వరసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ఆయనతో చేస్తే మంచి మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ ‘రాంబో’ రీమేక్ కు మొదట ఆప్షన్ ..ప్రభాస్ కాదు.. అసలైతే ఈ సినిమా రీమేక్ ని బాలీవుడ్ యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నారు హిందీ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌. ఈ మేరకు మూడేళ్ల క్రితం అఫీషియల్ గా ప్రకటన కూడా చేసారు.. కానీ అయితే టైగర్‌ ‘రాంబో’ కోసం కాల్షీట్స్ ని సర్దుబాటు చేయడం లేదట. దాంతో ‘బాహుబలి’ హీరో ప్రభాస్‌ని ‘రాంబో’ సినిమా కోసం దర్శకుడు సిద్ధార్థ్ సంప్రదించాడట..దాంతో ప్రభాస్ కి అది నచ్చడంతో ఒకే చెప్పినట్లు తెలుస్తోంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here