పీఎఫ్ డబ్బులు ముందే తీసుకునే వారికి షాకింగ్ న్యూస్..!

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు ప్రావిడెంట్ ఫండ్ గురించి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. పీఎఫ్ అకౌంట్లు ఉన్నవాళ్లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇచ్చే మొత్తం కంటే ఎక్కువ శాతం వడ్డీ లభిస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ అకౌంట్ సర్వీసులను తన సబ్‌స్క్రైబర్లకు అందిస్తోంది. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి వేతనంలో 12 శాతం జమవుతుంది.

 

ఉద్యోగుల వేతనంలో కట్ అయ్యే అమౌంట్ తో పాటు కంపెనీ కూడా అదే మొత్తంలో నగదును ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలకు 8.5 శాతం వడ్డీ లభిస్తుండగా ఆర్థిక సంవత్సరం వడ్డీ రేట్ల సమీక్ష అనంతరం వడ్డీ రేటు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌లో పీఎఫ్ స్కీమ్ ఒకటని ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేటు స్థిరంగా కొనసాగుతూ ఉంటుంది.

అయితే ఉద్యోగులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైతే ముందుగానే పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంటి కొనుగోలు, మెడికల్ ఎమర్జెన్సీ, పెళ్లి, పిల్లల చదువు కోసం పీఎఫ్ అమౌంట్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం డాక్యుమెంట్ ప్రూఫ్స్ ను అందజేయాల్సి ఉంటుంది. అయితే ఎంతో అవసరం అయితే మాత్రమే పీఎఫ్ డబ్బులను మధ్యలో విత్ డ్రా చేసుకోవడం మంచిది. ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ సొమ్మును విత్ డ్రా చేసుకుంటే భారీగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి.

ఎవరైతే నిర్ణీత సమయం కంటే ముందుగానే పీఎఫ్ అమౌంట్ ను విత్ డ్రా చేసుకుంటారో వారికి రిటైర్మెంట్ సమయానికి చాలా తక్కువ మొత్తం మాత్రమే లభిస్తుంది. ఐదు సంవత్సరాల సర్వీస్ కంటే ముందే పీఎఫ్ అమౌంట్ ను విత్ డ్రా చేసుకుంటే అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత కాలంలో కాంపౌండింగ్ బెనిఫిట్ ను కోల్పోయే అవకాశం ఉంటుంది.