తెలుగు ఇండస్ట్రీలో కలర్స్ స్వాతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటన ద్వారా బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించి వెండితెరపై హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న అతి కొంతమంది అమ్మాయిలలో కలర్స్ స్వాతి ముందుంటారు.

సుమారు 18 ఏళ్ళ క్రితం కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా పరిచయమైన స్వాతి తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని పేరుకు ముందు కలర్స్ అనే పేరును సంపాదించుకుంది. కొన్ని సంవత్సరాల పాటు బుల్లితెర పై దూసుకుపోయిన కలర్స్ స్వాతి వెండితెరపై కృష్ణవంశీ, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుల దగ్గర పని చేస్తోంది.వెండితెరపై కలర్స్ స్వాతి నటించిన స్వామి రారా, కార్తికేయ వంటి చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా కలర్ స్వాతి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె ప్రస్తుతం తెలుగులో “పంచతంత్రం” అనే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కొత్త దర్శకుడు హర్ష పులిపాక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కలర్స్ స్వాతి నటిస్తున్న పంచతంత్రం సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ను హీరో అడవి శేషు విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ పోస్టు ద్వారా సినిమాలోని కొత్తదనం కనిపిస్తోంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. కలర్స్ స్వాతి పంచతంత్రం సినిమాలో సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం, సముద్రఖని, హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక, నరేష్, అగస్త్య, దివ్య శ్రీపాద వంటి తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా గురించి స్వాతి మాట్లాడుతూ ఆరేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వనున్న తనకు ఇది ఒక ఫర్ ఫెక్ట్ కథ అని స్వాతి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here