కరోనా నేపథ్యంలో కొందరు తీవ్ర నష్టాలను చవిచూస్తుంటే.. మరికొందరు మాత్రం భారీగా లాభపడుతున్నారు. ఈ లిస్ట్ లో ప్రముఖ గేమ్ సంస్థ పబ్-జి ఒకటి.. ప్రస్తుతం యువతరం పబ్-జి జపం చేస్తోంది.. ఒకరకంగా యువత ఈ గేమ్ కి బానిసలు అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ గేమ్ ఆడుతూ వింత వింతగా ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. అయితే మిగిలిన దేశాలకంటే మన దేశంలోనే పబ్-జి ఆడేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 1.75 కోట్ల డౌన్లోడ్లతో ప్రపంచంలోనే భారత్ నుంచి ఎక్కువ మంది ఈ గేమ్ ని ఇంస్టాల్ చేసుకున్నారు. అసలు విషయానికి వస్తే..

గత ఆరునెలల్లో పబ్-జి గేమింగ్ సంస్థ రికార్డ్ స్థాయిలో లాభాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో 1.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది పబ్-జి సంస్థ. మన కరెన్సీ ప్రకారం రూ.9.731 కోట్లు అన్నమాట. ప్రస్తుతం పబ్-జి రెవెన్యూ 3 బిలియన్ డాలర్ల (రూ. 22,475 కోట్లు) కు చేరింది. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు అందరు ఇళ్లకే పరిమితం అవ్వడం వలన ఒక్క మార్చి నెలలోనే అత్యధికంగా 2,021 కోట్లు లాభాన్ని ఆర్జించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అనలైటిక్ సంస్థ సెన్సార్ టవర్ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here