రకుల్ ని పెళ్లి చేసుకోవాలని యాభై ఏళ్ల వ్యక్తి ప్రపోజల్ పెట్టాడా..?

0
154

కొన్ని రోజులు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలేవీ లేవనిచెప్పాలి. వైష్ణవ తేజ్ రెండో సినిమా తప్పా రకుల్ ఏ హీరో సినిమాలో నటించట్లేదు.. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ తొలి సినిమా తోనే మంచి సక్సెస్ కొట్టివాంటెడ్ హీరోయిన్ అయిపొయింది.. అనతి కాలంలో నే స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.. అయితే పూజ హెగ్డే, రష్మిక మందన్న ఎంట్రీ తో ఆమెకు ఛాన్స్ లు తగ్గిపోయాయి.. చాలారోజుల తర్వాత ఇటీవలే విడుదల అయిన నితిన్ చెక్ సినిమా లో కనిపించిన రకుల్ కి ఆ సినిమా ద్వారా వచ్చిన ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువ అని చెప్పాలి..

సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ కి ఏమంత పేరు కూడా రాలేదు. పోనీ సినిమాలో అన్నా బాగా కనిపించిందా అంటే అదీ లేదు.. మరి ఈ అమ్మడికి సినిమా ఆఫర్ లు ఎలా వస్తాయో చూడాలి. తాజగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మ్యారేజ్‌పై షాకింగ్‌ కామెంట్‌ చేసింది. తనకు యాభై ఏళ్ల వ్యక్తి నుంచి మ్యారేజ్‌ ప్రపోజల్‌ వచ్చిందని చెప్పింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల మ్యారేజ్‌ విషయంలో స్పందిస్తూ ఫ్యాన్స్ విస్తూ పోయే విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇటీవల కపిల్‌ శర్మ టాక్‌ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా తాను సింగిల్‌గా ఉండటంపై అసంతృప్తిని వ్యక్తి చేసింది. ఒంటరిగా ఉండటం కాస్త ఇబ్బందిగా ఉందట.`దే దే ప్యార్‌ డే` సినిమా ప్రమోషన్‌ టైమ్‌లో ఓసారి కమిల్‌ శర్మ టాక్‌ షోలో పాల్గొంది రకుల్‌.

ఈ సందర్భంగా ఓ రూమర్‌ గురించి చెప్పారు. అది నిజమా కాదా చెప్పాల్సి ఉంటుంది.ఈ టాస్క్ లోనే రకుల్‌ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. `దే దే ప్యార్‌ దే` తర్వాత రకుల్‌కి 50ఏళ్ల వ్యక్తి నుంచి ప్రపోజల్‌ వచ్చిందనేది దాని సారాంశం.దీనిపై రకుల్‌ స్పందిస్తూ, అందుకే నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నాను అని చెప్పింది రకుల్‌. `దే దే ప్యార్‌ దే`లో రకుల్‌ యాభై ఏళ్ల వ్యక్తిని ప్రేమిస్తుంది. యాభైఏళ్ల వ్యక్తిగా అజయ్‌ దేవ్‌గన్‌ నటించారు.ఇందులో ఆయనతో డేట్‌ చేయడం ఆసక్తికరంగా, టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దీంతో రకుల్‌కి నిజజీవితంలో కూడా అలాంటి ప్రపోజల్స్ వచ్చాయని ఈ టాక్‌ షోలో వెల్లడించింది.అయితే తర్వాత ఆరా తీస్తే, ఇది నిజం కాదని, కేవలం ఆ టాక్‌ షోని రక్తికట్టించేందుకు మాత్రమే రకుల్‌ అలా చెప్పిందని అన్నారు. ఎంటర్‌టైన్‌ పంచడం కోసం అలా చేశారని కపిల్‌ శర్మ చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here