టాలీవుడ్ భల్లాల దేవ, యంగ్ హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. మిహీకా బజాజ్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు రానా.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలి 1,2 చిత్రాలలో భల్లాల దేవునిగా ప్రేక్షకులను అలరించిన దగ్గుబాటి రానా.. తన తాత దగ్గుబాటి రామా నాయుడు పేరును షార్ట్‌గా పెట్టుకున్నాడు.

తాత, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రానా దగ్గుబాటి 1984 డిసెంబర్ 14న జన్మించారు. చెన్నై, హైదరాబాద్‌లో విద్య పూర్తయిన తర్వాత చదువు పూర్తి కాగానే సినిమా నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించలేదు. ముందుగో విజువల్ ఎఫెక్ట్స్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత టాలీవుడ్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కావాల్సిన అనుభవాన్ని సంపాదించుకున్నారు.

స్పిరిట్ మీడియా పేరుతో షార్ట్ ఫిల్మ్స్ తీయడం ప్రారంభించారు. దాంతో జాతీయ స్థాయిలో అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత 2010లో ‘లీడర్’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మూవీ మొఘల్ Dr. దగ్గుబాటి రామా నాయుడు, తండ్రి సురేష్ బాబు వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారు. తొలి చిత్రంతోనే నటనలో తనదైన శైలిని చూపించారు. తెలుగులో సుప్రసిద్ధ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం.

రానా తన 2వ చిత్రంతోనే బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చారు. బిపాషా బసు సరసన కథానాయకుడిగా ‘ధమ్ మారో ధమ్’ చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’ చిత్రంలో హీరోగా నటించారు. ఐతే దగ్గుబాటి రానా ఎప్పుడూ హీరోగా మాత్రమే నటించేందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తనలోని నటనా శైలికి పదును పెట్టేందుకు మంచి మంచి కేరెక్టర్లను ఎంచుకున్నారు.

ఇందుకు ఆయన చేసిన హిందీ చిత్రం ‘బేబీ’ మొదటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా చాటిన బాహుబలి-1, బాహుబలి-2 చిత్రాల్లో విలన్ పాత్రను రానా పోషించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. నిజానికి బాహుబలి సినిమాకు బాలీవుడ్, హాలీవుడ్ సహా ఇతర దేశాల్లో అంత పేరు రావడానికి రానాయే కారణమని చెప్పవచ్చు. తనకు బాలీవుడ్‌లో ఉన్న పరిచయాలతో సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి రానా తన వంతు కృషి చేశారు.

బాహుబలి చిత్రం తర్వాత.. మరో ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రమైన ‘రుద్రమ దేవి’ లోనూ రానా నటించారు. ఈ చిత్రం పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమైనప్పటికీ.. ఆ చిత్రంలో నటించేందుకు రినా ఒప్పుకోవడం రానా నటనా చాతుర్యానికి నిదర్శనమని చెప్పవచ్చు. రానా నటనతో రుద్రమ దేవి చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది.

అలాగే దగ్గుబాటి రానా.. ఎప్పుడూ ప్రయోగాలు చేయడంతో ముందుంటారనడానికి ఆయన నటించిన ‘ఘాజీ’ బాలీవుడ్ చిత్రమే మరో చక్కటి ఉదాహరణ. ‘ఘాజీ’ చిత్రం విడుదలయ్యే వరకు పూర్తి స్థాయిలో నీటి అడుగున తీసిన భారతీయ సినిమా అంటూ ఏదీ లేదు. 2017లో ఆ సినిమాను చేసి ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు దగ్గుబాటి రానా. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 34 కోట్లు వసూలు చేసిందంటే ఆశ్చర్యం కలూగకమానదు.

సినిమా కథలను ఎంచుకోవడంలో రానాకు మంచి పట్టుందని చెప్పడానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రమే ఒక మంచి ఉదాహరణ. లేటెస్టుగా రుద్రమదేవి సక్సెస్ తర్వాత.. ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ”హిరణ్య కశ్యప” చిత్రంలోనూ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు దగ్గుబాటి రానా.

టాలీవుడ్ లో ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ.. సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడటం రానా దగ్గుబాటిలో ఉన్న మరో ప్రత్యేకత. స్టార్ హీరోననే ఫీలింగ్ కానీ.. లేదా సినీ పరిశ్రమలో పెద్ద కుటుంబం నుంచి వచ్చాననే గర్వం కానీ ఆయనలో కొంచమైనా కనిపించదు.

ఈ నేపథ్యంలో రానా లగ్జరీ లైఫ్ ను తెలియజేసే విధంగా సోషల్ మీడియాలో ఈమధ్య ఆయన ఇంటి ఫోటోలు వైరల్‌ గా మారాయి.

2010లో కెరీర్ మొదలు పెట్టిన రానా ఈ తొమ్మిదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగి పోయాడు. ఏడాదికి రూ.6 నుండి 8 కోట్లు సంపాదించే రానా నికర ఆదాయపు విలువ రూ.142 కోట్లు. మన టాలీవుడ్ భల్లాలదేవ వాడే కారు ఖరీదు 2 కోట్లకు పైమాటే.

మరి రానా వాడే లగ్జరీ వస్తువులు ఏంటో తెలుసా.? TAGHeuer Grand Prix – ఈ వాచ్ విలువ రూ.3.25 లక్షలు Hublot Mexican – టాప్ బ్రాండ్ కి చెందిన ఈ వాచ్ ఖరీదు రూ.8.16 లక్షలు, BMW 7 సిరీస్ – రూ.1.32 కోట్లు, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ – దీని ధర రూ.2.73 కోట్లు.

హైదరాబాద్ లో రానా ఉండే ఇల్లు ఖరేదు ఐదు కోట్లకు దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం ఈ హీరో ‘హతి మేరే సాతి’, ‘1945’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అతడి చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

సినిమా రంగంలో మంచి నటుడిగా ఎదుగుతూనే.. మరోవైపు ప్రొడక్షన్ పైనా దృష్టి పెట్టారు హీరో రానా. బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని షోలకు తానే యాంకర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంచి వ్యాపార వేత్తగా ఎదగాలనుకుంటున్న దగ్గుబాటి రానాకు ప్రేక్షకులందరి తరఫున ఆల్ ది బెస్ట్ చెబుదాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here