కొంత మంది అమ్మాయిలకు జుట్టు ఎంతో పొడవుగా ఉండాలని ఆశపడుతుంటారు. కానీ చుండ్రు వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల హెయిర్ డ్యామేజ్ జుట్టు పెరగకుండా ఉంటుంది. అయితే జుట్టులో ఏర్పడే సమస్యలను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరగడానికి మనకు మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటివల్ల కొంతమందిలో జుట్టు రాలే సమస్య అధికమవుతుంది అలాంటి వారి కోసమే ఈ మెంతి చిట్కాలు…

సాధారణంగా మన వంటింట్లో దొరికే ఈ మెంతుల వల్ల ఎన్నో రకాల జుట్టు సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. జుట్టు రాలకుండా ఉండటానికి, ఒత్తుగా పెరగడానికి, తలలో చుండ్రు వంటి సమస్యలు తొలగి పోవడానికి ఈ మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మెంతులను ఏ విధంగా ఉపయోగించడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం….

మెంతులలో ఉండే బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల మన జుట్టులోని ఫ్రీరాడికల్స్ ను తొలగించి మన జుట్టు ఎంతో ఆరోగ్యవంతంగా ఒత్తుగా పెరిగేందుకు దోహద పడతాయి. మెంతులు జుట్టుకు మంచి కండీషనర్ గా ఉపయోగపడుతుంది. దీని వల్ల మన జుట్టు ఎంతో సాఫ్ట్, సిల్కీగా తయారవుతుంది.

రాత్రి పడుకునే ముందు ఒక చిన్న కప్ మెంతులను, పెరుగులో నానబెట్టి ఉదయం వాటిని మెత్తటి మిశ్రమంలా తయారు చేసుకొని మన జుట్టు కుదుళ్లకు బాగా అంటించుకుని ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల తలలో ఉన్న చుండ్రు మొత్తం తొలగిపోవడమే కాకుండా జుట్టు కుదుళ్ళు గట్టిగా తయారవుతాయి. ఇలా వారానికి కనీసం రెండు సార్లు అయినా చేయాలి.

మెంతులలో ఉండే ఫైటోస్టెరాల్స్, ఫైటోఈస్ట్రోజెన్స్ జుట్టు రాలకుండా కాపాడుతాయి. తలలో పేలు, సొరియాసిస్ వంటి సమస్యలతో బాధపడేవారికి మెంతులు ఒక చక్కటి పరిష్కారం. మెంతులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటి మైక్రోబియల్ ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వారంలో కనీసం రెండు సార్లైనా ఈ మెంతులను ఉపయోగించి తలస్నానం చేయటం ద్వారా అందమైన పొడవైన జుట్టు ను మీ సొంతం చేసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here