Real Doctors in TOLLYWOOD : మన తెలుగు సినిమాలలో అసలైన డాక్టర్స్ ఎవరో తెలుసా.?!

0
57

Real Doctors in TOLLYWOOD : ఒకసారి సినిమాలన్నీ తిరగేస్తే డాక్టర్ క్యారెక్టర్ లేని చిత్రాలు అత్యల్పంగ కనిపిస్తాయి. సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ లెంతీగా లేనప్పటికీ.. అది ఒక సందర్భంలో సినిమాలోని కథకు టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది. అలాగే కథ మొత్తం డాక్టర్ చుట్టూ తిరిగే సినిమాలు కూడా వచ్చాయి. ఇకపోతే వీరంతా నిజమైన డాక్టర్స్ కాదు. కాకపోతే కొంతమంది నటీ నటులు వైద్య విద్యను అభ్య సించి లేదా ఆ వృత్తిలో కొనసాగిన కొంతమంది డాక్టర్స్ మన సినిమాలలో నటులుగా స్థిరపడిపోయారు.

అల్లు రామలింగయ్య నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. పుట్టిల్లు చిత్రం నిర్మాణకాలంలో తన భార్యా నలుగురు పిల్లలతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డాడు.

మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచిత వైద్యసేవ లందించేవాడు. ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలద్రొక్కుకున్నాడు.

తెలుగు సినీ పరిశ్రమలో యాంగ్రీ యంగ్ మేన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ యొక్క తల్లిదండ్రులు వరదరాజన్‌ గోపాల్‌, ఆండాళ్ పిళ్ళై. తండ్రి శేఖర్ ఒక పోలీసు అధికారి. రాజశేఖర్ చిన్నతనంలో ఎన్. సి. సి విద్యార్థి. మొదట్లో తండ్రిలాగే పోలీసు అధికారి కావాలనుకున్నా తండ్రి కోరిక మేరకు వైద్య విద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్యవృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది.
1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దురు కూతుర్లు శివాని, శివాత్మిక. పెద్ద కూతురు శివాని ఎం.బి.బి.ఎస్ పూర్తిచేసి సినిమాలోకి అడుగుపెట్టింది.

చక్కటి అభినయం, కుటుంబ కథలతో అశేష తెలుగు ప్రేక్షక అభిమానులను పొందిన నటి సౌందర్య. ఈమె సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా, ఆమె తండ్రి యొక్క స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత, ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది. తరువాత ఆమె తెలుగు చిత్రరంగలోకి ప్రవేశించి, ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది.

సాయి పల్లవి ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు. మెడిసిన్ నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది.ఆతర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించింది. ఈ సినిమాతో సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.