ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థను మోసం చేసి నకిలీ వస్తువులు పంపిన ముగ్గురు ఘనులు… !!

0
253

ఇండియాలోనే ఈ-కామర్స్ సంస్థలలో దిగ్గజం అమెజాన్. ఒక్క క్లిక్కుతో కావాల్సిన వస్తువులను ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా చేరవేసే అమెజాన్. ఈ సంస్థ ద్వారా ఆన్లైన్ లో వస్తువులను కొనుగోలు చేసుకునే వారు మనలో చాలా మండే ఉన్నారు. నిత్యం ఎన్నో వస్తువులను అమెజాన్ సంస్థ తమ కస్టమర్లకు చేరవేస్తుంది. మనకు కావలిసిన వస్తువులను అమెజాన్ లో కొనుగోలు చేసి డెలివరీ అయ్యాక చూసుకుని ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసే సదుపాయాలు కల్పిస్తుంది. అయితే ఈ రిటర్న్ ఆప్టిన్ ను అవకాశంగా తీసుకుని కొందరు ఏకంగా అమెజాన్ సంస్థనే మోసం చేసారు.

జగిత్యాల పట్టణానికి చెందిన కట్ట కరుణ్ కాంత్, వేణుమాధవ్, మొహసిన్ లు అమెజాన్ లో వస్తువులను కొనుగోలు చేసేవారు. ఏకంగా 8లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసారు వీరు ముగ్గురు. ఆన్లైన్లో వీరు కొన్న వస్తువులు డెలివరీ అయిన తరువాత ఆ వస్తువులు సరిగా లేవని వంకలు చెప్పి తిరిగి వాటిని వెనక్కి పంపే క్రమంలో అమెజాన్ నుంచి వచ్చిన వస్తువులను పక్కకు పెట్టి, ఖాళీ డబ్బాలో నకిలీ వస్తువులను ఉంచి తిరిగి పంపించేశారు. ఒక్కసారిగా ఇన్ని లక్షల వస్తువులు తిరిగి రావడంతో అనుమానం వచ్చిన అమెజాన్ ప్రతినిధులు డబ్బాలను తెరిచి చూడగా అందులో ఉన్న నకిలీ వస్తువులను చూసి, తమను మోసం చేసారని గ్రహించి అమెజాన్ లీగల్ టీమ్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here