మూడు దశాబ్దాల్లో ముగ్గురు టాప్ హీరోల సినిమాలు ఒకే టైటిల్ తో రావడం ఒక విశేషం. ఈ మధ్యకాలంలో ఆనాటి హిట్ అయిన సినిమా టైటిల్ ని తొందరగా పబ్లిక్ లోకి రిజిస్టర్ అవుతుందని పాత టైటిల్ నే రిపీట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో అలాంటిదేమీ లేకుండానే ఓ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి.

జగపతి ప్రొడక్షన్స్ అధినేత వి.బి. రాజేంద్ర ప్రసాద్ హీరో అవుదామని గుడివాడ నుండి మద్రాస్ కు రైలెక్కి వచ్చాడు. కానీ అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండటంతో ప్రొడ్యూసర్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది.

అలా జగపతి ప్రొడక్షన్స్ స్థాపించి 1960లో అన్నపూర్ణ అనే చిత్రాన్ని నిర్మించాడు. రెండవ చిత్రంగా 1962లో వి.మధుసూదనరావు దర్శకత్వంలో నాగేశ్వరరావు సావిత్రి హీరోయిన్ లుగా ఆరాధన సినిమా నిర్మించాడు. నాగేశ్వరరావు వైద్య వృత్తిలో కనబడుతూ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

ఇదే టైటిల్ తో భాస్కరచిత్ర బ్యానర్ పై 1976లో బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఎన్టీ.రామారావు వాణిశ్రీ లు హీరో హీరోయిన్లుగా ఎస్ హనుమంత రావు సంగీత సారథ్యంలో ఆరాధన సినిమా రావడం జరిగింది.. నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై.. అనే పాట ఆ రోజుల్లో ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కథ పాటలు బాగుండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాధించింది.

1987 ఇదే సంవత్సరం గీత ఆర్ట్స్ బ్యానర్ లో రెండు చిత్రాలు వచ్చాయి. పసివాడి ప్రాణం ఘన విజయాన్ని సాధించగా ఆరాధన సినిమా ఫ్లాప్ గా నిలిచింది. చిరంజీవికి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే క్లాసిక్ డైరెక్టర్ భారతీరాజా తెలుగులో చివరి చిత్రం ఆరాధన సినిమాలో నటించడం జరిగింది. ఈ సినిమాలో రాధికా సుహాసినిలు హీరోయిన్లుగా నటించారు. ఇళయరాజా స్వరపరిచిన ‘అరే ఏమైంది ఈ వయసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది..’ అనే పాట హిట్ అయినా ఆరాధన సినిమా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here