ఎస్బీఐ సూపర్ స్కీమ్.. తక్కువ మొత్తం డిపాజిట్.. లోన్ పొందే అవకాశం..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్బీఐ అమలు చేస్తున్న స్కీమ్ లలో ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఇతర స్కీమ్ లకు భిన్నంగా ఉండే ఈ స్కీమ్ ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. మనలో చాలామందికి స్థిరమైన ఆదాయం, ఖర్చులు ఉండవు.

ప్రతి నెలా ఒకే మొత్తం డబ్బులు డిపాజిట్ చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటి వారికి ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ లో నెలకు 500 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు. సంవత్సరానికి గరిష్టంగా 50,000 రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ లో సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి సులభంగా చేరవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లతో పోలిస్తే ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్ లో చేరితే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎప్పుడైనా డిపాజిట్ చేసే అవకాశం ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరితే ప్రస్తుతం 5.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్లు లేదా ఏడేళ్లు ఈ స్కీమ్ లో చేరి డబ్బులను డిపాజిట్ చేయవచ్చు.

సాధారణంగా లభించే వడ్డీతో పోలిస్తే సీనియర్ సిటిజన్స్ కు ఎక్కువగా వడ్డీ వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు డిపాజిట్ చేసిన మొత్తంలో 90 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అత్యవసర సమయాల్లో రుణం తీసుకునే అవకాశం ఉండటంతో ఇతర స్కీమ్ లతో పోలిస్తే ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.