ఏంటీ.. నదియాకు ఇంత పెద్ద కూతుళ్ళున్నారా.?

0
392

నదియా అనగానే మనందరికీ అత్తారింటికి దారేది చిత్రంలోని అత్తగారి పాత్ర గుర్తొస్తుంది. ప్రజెంట్ టాలీవుడ్ లో ఇలాంటి వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు బాగా కనెక్టైపోయిన న‌దియా ఒకప్ప‌టి టాప్ హీరోయిన్‌. 1985లో వ‌చ్చిన  “పూవ్ పూచుదవ” అనే చిత్రంతో త‌మిళ రంగానికి పరిచయమయ్యారు. రజనీకాంత్, మోహన్, విజయకాంత్, సత్యరాజ్, ప్రభు, సురేష్ వంటి టాప్ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించి త‌న‌కంటూ ప్ర‌త్యేక ఫ్యాన్స్ ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. వింత దొంగలు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. కానీ తెలుగులో ఆమె కెరీర్ ఊహించినంత సక్సెస్ కాకపోవడంతో 1988లో అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శిరీష్ గాడ్ బోల్ ను పెళ్ళి చేసుకుని అమెరికాలోనే సెటిలైపోయారు.

లండ‌న్‌ లో ఆనందంగా భర్తతో వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్న న‌దియాకి 1996లో మొదటి సారిగా అమ్మాయి పుట్టింది. ఆమెకు సనమ్ అని పేరు పెట్టారు. 2001లో రెండో అమ్మాయి పుట్టింది. ఆమెకు జానా అనే పేరు పెట్టారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడిన నదియా మిర్చి చిత్రం. ద్వారా మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన న‌దియా తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇద్ద‌రు కూతుళ్ళ‌ని తొలిసారిగా నెటిజన్లకు ప‌రిచ‌యం చేసింది.  సనమ్ – జానాలతో కలిసి న‌దియా దిగిన ఫోటోలను చూస్తుంటే ముగ్గురు తోబుట్టువుల్లా క‌నిపిస్తున్నార‌ని, గ్లామర్ లో న‌దియా తన ఇద్దరి కూతుళ్ళకీ గట్టి పోటీయే ఇస్తుంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. 😀😀