Connect with us

Featured

సీనియర్ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ కొడుకు ఎలా వుంటాడో తెలుసా.?

Published

on

వెండితెరపై వినోదాన్ని పండించడంతో పాటు, బుల్లితెరపై విలనిజాన్ని పండిస్తూ ఇన్నేళ్ళుగా ప్రేక్షకులందరినీ అలరిస్తున్న నటుడు శుభలేఖ సుధాకర్. 3 దశాబ్దాల పైగా తెర పరిచితుడైన ఆయన ఈ మధ్య సీరియల్స్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు.

1982లో కళాతపస్వీ K.విశ్వనాధ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘శుభలేఖ’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సుధాకర్ నాటినుండి ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. సితార, స్వాతి, మంత్రిగారి వియ్యకుండు, లేడీస్ టైలర్, స్రవంతి, ప్రేమించు పెళ్లాడు వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దాదాపు 100 చిత్రాల్లో నటించిన శుభలేఖ సుధాకర్ ఆనాటి అగ్ర హీరోలైన చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లతో పాటు ఈనాటి యంగ్ హీరోలందరితో కలసి నటించడమే కాకుండా తమిళ భాషలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుని, సీరియల్స్ లో కూడా సత్తా చాటుతున్నాడు. నటుడిగా సుధాకర్ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న నేపథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏరోజూ కూడా తాను Sp బాలు బావమరిదిగా సినిమా రంగంలో చెప్పుకోకుండానే తన సొంత టాలెంట్ తో నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా శుభలేఖ సుధాకర్ తన సత్తాను చాటుకున్నాడు.

1989 డిసెంబర్ 21న ఆయనకూ, ఎస్.పి. శైలజకూ పెళ్ళయింది. వాళ్ళిద్దరి పెళ్ళి జరిగేంత వరకు ఎవరి కెరీర్‌లలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అలాంటిది పెళ్లయిన తరువాత నుంచి చిత్రంగా ఇద్దరికీ అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇంతలో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌ కు షిఫ్ట్ అయింది. అయినా సరే శుభలేఖ సుధాకర్ చెన్నైలోనే ఉండిపోయారు. అప్పట్లో ‘ఈ’ టి.వి. వాళ్ళు సుధాకర్ తో ఒక సినిమా క్విజ్ కార్యక్రమం చేయించారు. ఆ తరువాత తమిళ ‘సన్’ టి.వి. రావడంతో సుధాకర్ కు సీరియల్స్‌లో నటించే అవకాశాలు వచ్చాయి. అప్పట్నుంచి మద్రాసులో తమిళ, తెలుగు భాషల్లో తయారవుతున్న ధారావాహికల్లో నటిస్తున్నారు. దర్శకుడు కె. బాలచందర్ గారు నిర్మాతగా, సముద్రఖని దర్శకత్వంలో తమిళం చేసిన ‘అన్ని’ సీరియల్ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ (‘వదిన’) సుధాకర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈమధ్య సినిమాల పరంగా చూస్తే.. ‘ర క్త చరిత్ర-2’ కానీ, ‘బెజవాడ’ కానీ బాగా ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.

ఆ 2 ఆడక పోవడంతో సుధాకర్ సినీ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. వాస్తవానికి సినిమాల్లో అవకాశాలు తక్కువగా ఉండడం వల్లే, టీవీలో కనిపిస్తున్నారు సుధాకర్. శుభలేఖ సుధాకర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే.. గతంలో సుధాకర్, శైలజలు. విడాకులు తీసుకున్నారనే రూమర్స్ పత్రికల్లో వచ్చాయి. ఇప్పటికీ ఆ మాట అడిగే వాళ్ళున్నారు. అప్పట్లో ఒక సినిమా పత్రిక ఎడిటర్ తమాషాగా రాసిన రూమర్ అని ఆ తర్వాత తేలింది. అప్పటికీ ఇప్పటికీ ఈ దంపతులిద్దరి వివాహ బంధం పటిష్ఠంగానే ఉంది. ఇక వాళ్ళబ్బాయి

విషయానికి వస్తే.. శుభలేఖ సుధాకర్ దంపతులకు ఒకే కొడుకు. పేరు శ్రీకర్. ఢిల్లీ మీడియా మేనేజ్‌మెంట్‌లో ఎం.బి.ఏ. చదువు పూర్తి చేసిన శ్రీకర్.. హైదరాబాద్ లో ఒక మీడియా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. అసలు సినిమా రంగమంటే ఏమాత్రం ఇష్టం లేని శ్రీకర్ తన తండ్రి యుక్త వయస్సులో వున్నప్పుడు ఎలా ఉండేవాడో అచ్చం అలానే ఉంటాడంటే నమ్మబుద్ధి కావడం లేదు కదూ.. సినిమా ఫంక్షన్లలోనూ, ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ ఎప్పుడూ ఎక్కువగా కనిపించని శ్రీకర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!