టీవీ యాంకర్ అనుమాస్పద మృతి !! శోకసంద్రంలో టీవీ పరిశ్రమ..

0
264

సినియర్ నటి మరియ యాంకర్ మృతితో టీవీ పరిశ్రమ శోకసంద్రంలోకి వెళ్లిపోయింది. బుల్లితెర యాంకర్, సీనియర్ నటి శాంతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడెం ఇంజినీర్స్ కాలనీలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించరు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఎస్ ఆర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టుమ్ నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే యాంకర్ శాంతి ఎలా చనిపోయింది అనే దానిపై చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తున్నారు. ఇది హత్యా ? లేక వేరే కారణాలతో శాంతి ఆత్మహత్య చేసుకుండా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంట్లో తనిఖీలు చేసి ఆమె ఫోన్ ని స్వాదీనం చేసుకున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. వైజాగ్ కు చెందిన శాంతి పలు సీరియల్స్ లో నటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here