Connect with us

Featured

సింపుల్ గా కనిపిస్తున్న సిద్దార్థ్ పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

Published

on

సినీనటుడు సిద్దార్థ్ (siddarth) ఇటీవల మరోసారి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈయన నటి అదితి రావు హైదరి(Aditi Rao Hydari) తో మరోసారి ఏడడుగులు నడిచారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు. అయితే సెప్టెంబర్ 16వ తేదీ వీరి వివాహం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే వీరి వివాహం జరిగింది.

Advertisement

ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటోలలో సిద్దార్థ్ ధరించిన వాచ్ (Watch) అందరి దృష్టిని ఆకర్షించింది. బ్రౌన్ బెల్ట్, గెల్డెన్ వాచ్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. సిద్ధార్థ్ ధరించిన గోల్డ్ కేస్‌తో కూడిన ఆడెమర్స్ పిగ్వెట్ రాయల్ ఓక్ వాచ్‌ ధర రూ.27.62 లక్షలు అని సమాచారం. సింపుల్ గా కనిపిస్తున్న ఆ వాచ్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.

సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణం కానీ సిద్దార్థ్ కట్టిన ఈ వాచ్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించిన ధర మాత్రం భారీ స్థాయిలో ఉండడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరిద్దరికీ మొదట పరిచయం మహాసముద్రం సినిమా సమయంలో జరిగిందని అప్పుడే వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నట్టు అదితి పలు సందర్భాలలో తెలిపారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి నిజ జీవితంలో కూడా ఒకటయ్యారు. ఇక వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడంతో నేటిజన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Sayaji Shinde: బెస్ట్ ఫ్రెండ్స్ ని కలుసుకున్న పవన్ కళ్యాణ్.. నెట్టింట ఫొటోస్ వైరల్!

Published

on

Sayaji Shinde: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒక వైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన డిప్యూటీ సీఎం కాకముందు కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇటీవల సినిమాలకు సంబంధించిన షూటింగ్ ని కూడా మొదలుపెట్టారు. మరోవైపు తిరుమల లడ్డు వివాదంలో భాగంగా స్పందించడంతోపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన విషయం తెలిసిందే.

Advertisement

ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తన హెల్త్ సహకరించకపోయినప్పటికీ తిరుమల శ్రీవారిని నడుచుకుంటూ వెళ్లి మరి దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. పవన్ వెంట ఆయన ఇద్దరి కూతుళ్లు, ఆర్డ్ డైరెక్టర్ ఆనంద్ సాయి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,తమ్ ఇలా పలువురు ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా ఆనంద్ సాయి పవన్ వెంటే ఉన్నారు. అలిపిరి మొదలు శ్రీవారి దర్శనం అయ్యే దాకా డిప్యూటీ సీఎం వెంటే ఉండి పవనకు సహాయ సహకారాలు అందించారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు.

లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్..

అయితే మిగతా ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి పవన్ కలిసి దిగిన ఫోటో మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫోటోని చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తన లైఫ్ టైం బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫొటో కావడంతో ఇది అభిమానులకు మరింత స్పెషల్ గా మారింది. ఆనంద్ సాయి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఆ ఫోటోని చూసిన అభిమానులు పార్టీ నేతలు లైఫ్ టైం ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సార్ అపాయింట్మెంట్ ఇప్పించండి : షాయాజీ షిండే

Published

on

Pawan Kalyan: తెలుగు ప్రేక్షకులకు నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ అయినా షాయాజీ షిండే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. పాజిటివ్ పాత్రలలోనే కాకుండా నెగటివ్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం అడపదడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే కొంచం గ్యాప్ తర్వాత ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షాయాజీ షిండే. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్గా విడుదల కానుంది.

Advertisement

విడుదల తేదీకి మరి కొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు , షాయాజీ షిండే బిగ్ బాస్ షోకి వచ్చారు. బిగ్ బాస్ స్టేజిపై సుధీర్ బాబు షాయాజీ షిండే గురించి మాట్లాడుతూ.. ఖాళీ ప్రదేశం కనిపిస్తే మొక్కలు నాటుతారని అన్నాడు. దీంతో నాగార్జున కారణం అడగ్గా షాయాజీ షిండే మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయే ముందు నా దగ్గర ఇంత డబ్బు ఉండి కూడా ఆమెను బతికించుకోలేకపోతున్నాను నేనేం చేయను అని ఆలోచించాను. అప్పుడు మా అమ్మ బరువుకు సమానమైన విత్తనాలు తీసుకొచ్చి ఇండియా మొత్తం నాటుతానని ఫిక్స్ అయ్యాను.

అవి పెరిగి పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది. సాధారణంగా ఆలయాలకు వెళ్తే ప్రసాదం ఇస్తారు. ప్రసాదంతో పాటు ఒక మొక్క కూడా ఇస్తే బాగుంటుంది. నేను మహారాష్ట్రలో ఆల్రెడీ మూడు ఆలయాల్లో ఇంప్లిమెంట్ చేశాను. అందరికి కాకపోయినా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించే వాళ్లకు ఇస్తారు. ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలు చెప్తాను. దేవుడు ప్రసాదంతో పాటు మొక్కలు కూడా పంచాలి. అవి తర్వాత జన్మలకు కూడా ఉంటాయి అని తెలిపారు.

మీ కోరిక నెరవేరుతుంది…

Advertisement

ఇక ఆ మాటలు విన్న నాగార్జున మీరు ఇప్పుడు చెప్పారుగా ఈ మాటలను ఆయన ఫ్యాన్స్ ఆయన దగ్గరకు తీసుకెళ్తారు. మీ కోరిక నెరవేరుతుంది అని అన్నారు. దీంతో ప్రస్తుతం షాయాజీ షిండే వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. మంచి ఆలోచన అని అంతా షాయాజీ షిండేని అభినందిస్తున్నారు. అంతే కాకుండా ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారు చూసేవరకు షేర్ చేయండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి షాయాజీ షిండే కోరిక మేరకు ఆయనకు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో చూడాలి మరి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్న మహేష్ బాబు.. మళ్లీ విదేశాలకు చెక్కేసాడుగా!

Published

on

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. మహేష్ బాబు త్వరలోనే రాజమౌళి తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా మారిపోయారు. అందులో భాగంగానే మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం తన పూర్తి లుక్ ని మార్చేశారు. ఇదివరకు ఎప్పుడూ కనిపించని విధంగా సరికొత్త లుక్ లో పూర్తీ గడ్డం, బాగా వెంట్రుకలు పెంచుకొని కనిపించనున్నారు.

Advertisement

ఇప్పటికే మహేష్ బాబుకు సంబంధించిన చాలా రకాల ఫోటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ ఫోటోలను బట్టి చూస్తే రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ ఈ మధ్య ఎప్పుడు కనపడినా లుక్స్ వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరోసారి మహేష్ అదిరిపోయే స్టైలిష్ లుక్ తో కనపడ్డాడు. రెగ్యులర్ గా వెకేషన్ కి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు తాజాగా మరోసారి విదేశాలకు చెక్కేసాడు. అయితే వెకేషన్ కా, అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికా లేదా రాజమౌళి సినిమా వర్క్ కోసమా అనేది తెలియదు.

స్టైలిష్ లుక్..

నేడు ఉదయం మహేష్, నమ్రత కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు. దీంతో మహేష్ ఎయిర్ పోర్ట్ విజువల్స్ వైరల్ గా మారాయి. మహేష్ స్టైలిష్ హుడీ వేసుకొని, గాగుల్స్, క్యాప్ పెట్టుకొని గడ్డం, లాంగ్ హెయిర్ తో అదరగొట్టాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఎప్పుడూ చిన్న మీసం కట్టు, గడ్డం లేకుండా కనిపించే మహేష్ బాబు ఈసారి ఏకంగా గడ్డం పెంచుకొని జుట్టు బాగా పెంచుకొని అర్జున్ రెడ్డి లాగా కనిపించడంతో మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ లుక్, లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!